ప్రతిరోజు ఉదయం ఇలా చేస్తే ఆ ఇంటి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందా..
TeluguStop.com
మనదేశంలో దాదాపు చాలా మంది ప్రజలు తమ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని పూజలు చేస్తూ ఉంటారు.
ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని లక్ష్మీదేవిని కోరుకుంటుంటారు.అలా చేసే పనులలో కొన్ని ఉదయం లేచిన వెంటనే ఇలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోనే ఆర్థిక సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.
తులసి మనదేశంలో తులసి మొక్కను దాదాపు చాలామంది ప్రజలు తమ ఇంటి లో పెంచుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ఈ తులసి మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లను నైవేద్యంగా పెట్టడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు దూరం అవుతాయి.
అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీరు ఈ మంత్రాన్ని జపిస్తూ సమర్పించాలి.
మహాప్రసాద జనని, సర్వ సౌభాగ్యవర్ధిని, ఆది వ్యాధి హర నిత్యం, తులసి త్వం నమోస్తుతే.
ఇలా చేయడం వల్ల అదృష్టం, సంతానోత్పత్తి, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.తులసి పూజ చేసిన తర్వాత మీరు సమర్పించిన అదే పాత్రలో తులసి ఆకులను ఉంచి ఇంట్లో అంతా చల్లడం కూడా ఆ ఇంటికి మంచిదే.
ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరు అనారోగ్య సమస్యల నుంచి దూరం అవుతారు.
ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. """/"/
ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయడం చేయకూడదు.
ఇంకా చెప్పాలంటే తులసి కోటకు నమస్కరించకుండా తులసి ఆకులను తెంపకూడదు.సాయంత్రం పూట నుంచి తులసి మొక్కను తాకరాదు.
ఒకవేళ తులసి మొక్కను తాగితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.దీనివల్ల మీ ఇంటిలోని కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నువ్వు అసలు మనిషివేనా రష్మిక… బండ బూతులు తిడుతున్న నేటిజన్స్… ఏమైందంటే?