Hair : పడుకునే ముందు ఇలా చేస్తే మీ జుట్టు అందంగా మారడం ఖాయం..!

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఎన్నో రకాల జుట్టు సమస్యలను( Hair Problems ) ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు.

ఈరోజు మనం మీ జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు మీ జుట్టును అందంగా, బలంగా మార్చుకోవడానికి కొన్ని రకాల పద్ధతులను ప్రయత్నించి ఉండవచ్చు.

కానీ ఈ పద్ధతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు రాత్రి నిద్ర పోవడానికి ముందు ఈ ఐదు ముఖ్యమైన పనులు చేస్తే చాలు.

మీ జుట్టు, పొడవుగా, అందంగా మెరుస్తూ ఉంటుంది.దీన్ని చేయడానికి మీకు ఎక్కువ శ్రమ, సమయం కూడా అవసరం లేదు.

ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు జుట్టు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ముఖ్యమైనది రాత్రి నిద్రపోవడానికి ముందు మీ జుట్టును బాగా వాష్ చేసుకోవాలి.

అలాగే రాత్రి నిద్రపోవడానికి ముందు తలకు కొబ్బరినూనె( Coconut Oil ) లేదా బాదం నూనెను( Almond Oil ) గోరువెచ్చగా చేసి మీ జుట్టుకు బాగా అప్లై చేయాలి.

ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి.దీని వల్ల జుట్టు మూలాలు బలంగా ఉంటాయి.

మరుసటి రోజు ఉదయం షాంపూ అప్లై చేసి మీ జుట్టును శుభ్రం చేసుకోవాలి.

"""/" / అలాగే మీ రోజు వారి పనిలో పడితే జుట్టు చెమటగా ఉన్నా లేదంటే తలస్నానం చేసిన తర్వాత ముందుగా జుట్టును పూర్తిగా ఆరబెట్టాలి.

తడి జుట్టుతో నిద్రపోవడం అస్సలు మంచిది కాదు.దీని వల్ల జుట్టు విరిగిపోతుంది.

అలాగే మీ జుట్టులో చిక్కుముడులను తగ్గించుకోవడానికి రాత్రి నిద్రపోవడానికి ముందు స్కార్ఫ్ తో మీ జుట్టును కప్పుకోవడం అలవాటు చేసుకోవాలి.

అలాగే జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర పోవడానికి ముందు, ఉదయం నిద్ర లేవడానికి ముందు బాగా నీళ్లు తాగుతూ ఉండాలి.

పాలస్తీనాకు అనుకూలంగా వ్యాసం.. అమెరికాలో భారతీయ విద్యార్ధిపై సస్పెన్షన్ వేటు