గ్రహణం సమయంలో ఈ తప్పులను చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవు..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏడాదిలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన ఏర్పడబోతుంది.
దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ ( Ring Of Fire )అని కూడా పిలుస్తారు.
అయితే ఈ గ్రహణాన్ని చూడాలనుకునేవారు చాలామంది ఎంతో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
లేదంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు.ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన నవరాత్రులు మొదలుకానున్నాయి.
అయితే ఈ నవరాత్రులకు ఒక రోజు ముందు శనివారం రోజు సూర్యగ్రహణం( Solar Eclips ) ఏర్పడబోతోంది.
ఈ సంవత్సరంలో ఇది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అని నిపుణులు చెబుతున్నారు.
భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు సూర్య రశ్మి భూమిని చేరదు.దీనినే సూర్యగ్రహణం అని పిలుస్తారు.
"""/" /
కొన్ని రకాల నమ్మకాల ప్రకారం గ్రహణం ఏర్పడడానికి శుభప్రదంగా అసలు భావించరు.
ఈ సూర్య గ్రహణం ఉత్తరా అమెరికా, కెనడా, మెక్సికో, అర్జెంటీనా తదితర దేశాలలో కనిపిస్తుంది.
ఈ ఖగోళ ఘట్టాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు.అయితే సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి భద్రత లేకుండా నేరుగా కంటితో చూడడం అసలు మంచిది కాదు.
దీని వల్ల కంటి చూపు తగ్గే ప్రమాదం కూడా ఉంది.ముఖ్యంగా కంటి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు చెబుతున్నారు.
అందుకే గ్రహణాన్ని చూడాలనుకుంటే కంటికి రక్షణగా ఏదైనా పెట్టుకోవడం మంచిది.సూర్యగ్రహణం సమయంలో కచ్చితంగా గుర్తించుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముఖ్యంగా చెప్పాలంటే సూర్యగ్రహణం సమయంలో సూర్యరశ్మి( Sunlight ) చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.
ఇది మన కంటి చూపును దెబ్బతీస్తుంది.అందుకే గ్రహణాన్ని చూడడానికి మీరు టెలిస్కోప్ లేదా కెమెరాను ఉపయోగించడం మంచిది.
అయితే గ్రహణాలను చూడడానికి చాలామంది ఇంట్లోనే తయారుచేసిన ఫిల్టర్లను ఉపయోగిస్తూ ఉంటారు.కానీ ఇవి కళ్ళను అస్సలు రక్షించలేవు.
ఇది మీ కళ్ళకు ఎంతో హానిని కలిగిస్తుంది.గ్రహణాన్ని చూడడానికి ఇంట్లో తయారుచేసిన ఫిల్టర్లు లేదా తాత్కాలిక ఉపకరణాలను ఉపయోగించాలి.
అలాగే గ్రహణాన్ని చూడడానికి సన్ గ్లాసెస్ ను అసలు ఉపయోగించకూడదు.గ్రహణం సమయంలో ఎక్కువసేపు బయట ఉంటే సూర్యుని హానికరమైన కిరణాల వల్ల మీ చర్మం దెబ్బ తినే అవకాశం ఉంది.
అలాగే గ్రహణం సమయంలో పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టి ఉండకూడదు.
ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నాడేంటి.. ఇస్త్రీ చేయడంలో నూతన ఐడియా