అలా చేస్తే కూటమి ఢమాల్ !

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది.ఇంకా కూటమికి మద్దతు పలికే పార్టీలను ఆహ్వానిస్తోంది.

తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, డి‌ఎం‌కే, జేడీయూ.ఇలా పలు కీలక పార్టీలే ఇండియా కూటమిలో ఉన్నాయి.

ఈసారి ఎలాగైనా కేంద్రంలో కూటమిని అధికారంలోకి తూసుకురావాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

అయితే కూటమిలో ఒక్క విషయంపై మాత్రం అసంబద్దత నెలకొంది. """/" / అదే పి‌ఎం అభ్యర్థి విషయంలో.

కూటమిలో ఉన్న కొంతమంది కీలక నేతలు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండేందుకు తెగ ఆరాటపడుతున్నారు.

కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ( Rahul Gandhi )ఆల్రెడీ ప్రధాని రేస్ లో ఉండగా.

జేడీయూ నుంచి నితిశ్ కుమార్, ఆమ్ ఆద్మీ నుంచి కేజ్రీవాల్ ఇంకా తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ (Mamata Banerje )వంటి వారు సైతం పి‌ఎం రేస్ లో ఉన్నారు.

దాంతో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడం కత్తి మీద సామే.

అయితే సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉండడంతో కూటమిగా ప్రజల్లోకి వెళ్లాలంటే పి‌ఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్న ఎదురవ్వక తప్పదు.

"""/" / ఈ నేపథ్యంలో పి‌ఎం అభ్యర్థిని ఎన్నికల ముందే ఎన్నుకుంటారా లేదా ఎన్నికల తరువాత పి‌ఎం పదవి విషయంలో ఆలోచిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ( Mallikarjun Kharge )తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

పి‌ఎం అభ్యర్థిని ఇప్పుడే ఎన్నుకుంటే కూటమి ఖచ్చితంగా ఛీలుతుందని, అందుకే ఆ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎన్నికలల్లో విజయం తరువాతనే పి‌ఎం ఎవరనే దానిపై కసరత్తు చేస్తామని చెప్పుకొచ్చారు.

ఖర్గే చేసిన వ్యాఖ్యలతో పి‌ఎం అభ్యర్థి లేకుండానే ఇండియా కూటమి ఎన్నికలకు వెళ్లనుందనే విషయం స్పష్టమైంది.

మరి కూటమి ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

కెనడా : యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ సెనేట్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి