అలా చేస్తే.. బీజేపీకి లాభామా ?

2024 సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదు.దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మోడ్ లోకి వచ్చేసాయి.

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి( Congress ,BJP ) మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

అందువల్ల ఈసారి పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections )కోసం బీజేపీ గట్టిగా ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికీ రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ మూడో సారి కూడా అధికారంలోకి రావాలని తెగ ఉబలాటపడుతుంది.

2014, 2019 ఎన్నికల్లో సింగిల్ హ్యాండెడ్ గా సత్తా చాటిన కమలం పార్టీ ఈసారి అంతకుమించి అనేలా మ 300 కు పైగా సీట్లు సాధించాలనే టార్గెట్ కూడా పెట్టుకుంది.

ఇదిలా ఉంచితే మరోవైపు ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని విపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

అందుకోసం ఐక్యతే మంత్రంగా జపిస్తున్నాయి. """/" / ఎప్పటికే అన్నీ పార్టీలు ఏకమయ్యేందుకు గట్టిగానే కసరత్తులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ అనుకున్న లక్ష్యం చేరాలంటే అంతా తేలికైన విషయం కాదు.

అందువల్ల వచ్చే ఎన్నికల్లో అనుకున్న లక్ష్యం చేరాలంటే బీజేపీ ముందున్న మాస్టర్ ప్లాన్ జమిలి ఎన్నికల విధానాన్ని ప్రవేశ పెట్టడం.

గత కొన్నాళ్లుగా ఈ విధానంపై అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నాయి.జెమిలి ఎన్నికల( Jemili Election ) విధానంలో అన్నీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది.

ఇలా చేయడం వల్ల బిజెపి అన్నీ రాష్ట్రాలపై ఏక కాలంలో దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుంది.

"""/" / అందువల్ల జమిలి ఎన్నికల విధానాన్ని ప్రవేశ పెడితే బీజేపీకి గట్టిగానే లాభం చేకూరే అవకాశం ఉంటుంది.

అందుకే మోడి సర్కార్( Modi Sarkar ) ఆ విధానం వైపు అడుగులు వేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే జమిలి ఎన్నికల విధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అనేది ప్రశ్నార్థకమే.

ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.దీంతో జమిలి ఎన్నికల విధానం ప్రవేశ పెడితే ఈ రాష్ట్రాల ఎలక్షన్స్ టైమింగ్ లో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇక ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వర్తించాల్సి వస్తే కర్నాటక విషయంలో కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరమే.

మరి కేంద్ర బీజేపీ సర్కార్ ఎన్నికల విషయంలో ఎలా అడుగులు వేస్తుందో చూడాలి.

ఒకవేళ జెమిలి ప్రవేశపెడితే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

మరి మోడీ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.

కొండ సురేఖ వివాదం .. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి విన్నపం