ఆదివారం ఇలాంటి పనులు చేస్తే.. జీవితంలోనీ సంతోషం మీ సొంతం..!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనితో బిజీగా ఉంటున్నారు.అలాగే వ్యాపారం, ఉద్యోగం చేసేవారు ఎవరైనా ఉదయం నుంచి రాత్రి వరకు తిరిక లేకుండా గడుపుతూ ఉన్నారు.

ఇలా ప్రతిరోజు పనిచేయడంతో శరీరం కలిసిపోయి అనేక అనారోగ్యాలకు గురవుతుంది.అందుకే వారంలో ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలని పూర్వం రోజులలోనే చెప్పారు.

ఆ రోజు స్కూలుకెళ్లే విద్యార్థుల నుంచి ఉద్యోగం చేసే వారికి సైతం ఆదివారము వస్తుందంటే ఏదో తెలియని సంతోషం.

ఈ రోజున ఎలాంటి ఒత్తిడి( Stress ) లేకుండా ఉండవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు.

అయితే కొందరు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఆదివారాన్ని ( Sunday )వృధా చేస్తారు.

"""/" / ఈ రోజున ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకుంటే ఎంతో సంతోషంగా ఉండవచ్చు.

వారంలో ఆరు రోజులపాటు ఒత్తిడితో పని చేస్తారు.ఈ క్రమంలో మొబైల్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తుంది.

ఆఫీస్ స్టాఫ్ తోను ఇతర అవసరాలకు ఫోన్ ఉపయోగిస్తూ ఉంటారు.కొందరికి ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల తలనొప్పి తీవ్రంగా ఉంటుంది.

అంతేకాకుండా ఫోన్ స్క్రీన్ ను పదేపదే చూడడం వల్ల కళ్ళపై ఒత్తిడి కలిగి ఉంటుంది.

అయితే ఆదివారం ఒక్కరోజు ఫోన్ ను దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఏదైనా మంచి పుస్తకం కొని దాన్ని చదివి( Read The Book ) మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది.

అలాగే భార్యాభర్తలు( Husband And Wife ) ఇద్దరూ ఉద్యోగస్తులయితే వారం రోజులపాటు కలిసి మెలిసి ఉండడం అసలు సాధ్యం కాదు.

"""/" / ఈ క్రమంలో వంట చేసుకునే సమయం ఉండదు.ఆదివారం మొత్తం ఏదైనా స్పెషల్ గా కుకింగ్ చేసుకోవాలి.

ఈ సమయంలో ఇల్లాలి తో కలిసి భర్త కూడా వంటలో పాల్గొంటే వారి ఆత్మీయతను పొందవచ్చు.

దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ మరింత దృఢంగా మారుతుంది.అలాగే వారంలో ఆరు రోజులపాటు బిజీ లైఫ్ వల్ల వ్యాయామం చేసే సమయం ఉండదు.

ఆదివారం ఉదయం కొంత సమయం వ్యాయామం( Exercise ) చేయడం మంచిది.ఈ రోజు చేసే వ్యాయామం తర్వాత ఆరు రోజుల వరకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అలాగే మీ పిల్లలతో కొంత సమయాన్ని గడపడం కూడా మంచిదని చెబుతున్నారు.వారితో కలిసి పార్కు లేదా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.