రోజు ఈ విధంగా ఫేస్ మసాజ్ చేసుకుంటే మచ్చలు, ముడతలు పరార్!
TeluguStop.com
ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీయడంలో మచ్చలు, ముడతలు ముందు వరసలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అందుకే వాటిని వదిలించుకోవడం కోసం ఖరీదైన క్రీమ్స్, సీరమ్స్, ఫేస్ మాస్క్‌లను ఉపయోగిస్తుంటారు.
ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలన్నీ పాటిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ మసాజ్ చేసుకుంటే మచ్చలను, ముడతలను సులభంగా మరియు వేగంగా తరిమి కొట్టవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఫేస్ మసాజ్ ఏ విధంగా చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల కాఫీ బీన్స్‌ను వేసుకుని.
ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న కాఫీ బీన్స్‌ను చల్లారబెట్టుకోవాలి.
కంప్లీట్ గా కూల్ అయిన వెంటనే.వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/"/
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకున్నాక.కాస్త డ్రై అవ్వనివ్వాలి.
ఆపై ఐస్ వాటర్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు ఫేస్ మసాజ్ చేసుకుంటే ఎలాంటి మచ్చలైనా, ముడతలైనా పరార్ అవ్వడం ఖాయం.
అంతేకాదు, పైన చెప్పిన విధంగా ఫేస్ మసాజ్ చేసుకుంటే.సాగిన ముఖ చర్మం టైట్ గా, గ్లోయింగ్ గా మారుతుంది.
మరియు స్కిన్ టోన్ సైతం మెరుగ్గా మారుతుంది.
పాకిస్థానీకి చుక్కలు చూపించిన ఇండియన్.. వీడియో చూస్తే ఫిదా అవుతారు!