మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం చాలా ఆచారాలు పాటిస్తున్నాం.అందులో భాగంగానే హిందువులు కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని చెబుతారు.
అంతే కాదు అది అవిముక్త క్షేత్రం.విశ్యనాథుడెప్పుడూ కాశీ క్షేత్రాన్ని వదలడు.
శ్రీరామ కృష్ణులు కూడా అక్కడ అనుభూతి పొందారు.అక్కడ మరణించిన జీవుల్ని అమ్మవారు తన హస్తంతో తీయడం.
శివుడు తారక మంత్రోపదేశం చేయడం ప్రత్యక్షంగా చూశారు.జ్ఞానా దేవతలు కైవల్యం అనే మాట జ్ఞానులకు మాత్రమే వర్తిస్తుంది.
అది వేదోక్తి.కాశీలో మరణిస్తే విశ్వ నాథుడు తారక మంత్రోపదేశం చేస్తాడనే అచంచల విశ్వాసం గా ఉండే అదే జ్ఞానంగా భావించాలి.
ఆ జ్ఞానంతో ముక్తి లభిస్తుంది.శ్రీ శారదా దేవి విశ్వాసం కూడా అదే.
శ్రీ రామ కృష్ణ కథామృతం శ్రీ శారదా దేవి వచనా మృతం చదివితే తెలుస్తుంది.
అయితే ఇదే అనాదిగా వస్తున్నందున కాశీలో మరణిస్తే మనకు ముక్తి లభిస్తుందని చాలా మంది హిందువులు భావిస్తారు.
అందుకే నాటి నుంచి నేటి వరకు చాలా మంది కాశీలోనే ప్రాణాలు వదిలి ఆ పరమాత్మలో కలిసి పోవాలని అనుకుంటారు.
అలా వీలు కాని వాళ్లు కనీసం జీవితంలో ఒక్కసారి అయినా కాశీకి వెళ్లాలి అనుకుంటారు.
ముఖ్యంగా పిల్లల బాధ్యత తీరిపోయి ఒక వయస్సు వచ్చాక కాశీకి వెళ్తారు.అంటే వయసై పోయాక కాశీకి వెళ్లాలని.
ఒక వేళ చని పోయినా అక్కడే చనిపోవాలని కోరుకుంటారు.అందుకే కాశీకి వెళ్లే వారిని అంటే వయసై పోయిన వారు వెళ్లేటప్పుడు చాలా బాధతో అప్పగింతల కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటారు.
సెల్ ఫోన్ ముట్టుకోలేదు.. సివిల్స్ లో 11వ ర్యాంక్.. సాయి శివాని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!