ఇంట్లో ఇలాంటి విగ్రహాలు అలంకరిస్తే.. అదృష్టం ఎప్పుడు మీ వెంటే..!

ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఇప్పటివరకు సొంత ఇంటి కోసం కలలు కనే వారు ఉన్నారు.

అలాగే ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు.ఇల్లు చిన్నదైనా, పెద్దదైన ఇంటి అలంకారం ఇష్టం పడని వాళ్ళు ఎవరు ఉండరు.

మనం ఉండే ప్రదేశం శుభ్రంగా, అందంగా ఉంటే ప్రశాంతంగా ఉండటమే కాకుండా జీవితంలోకి ఆనందాలను కూడా తెస్తుంది.

దేవతమూర్తుల, జంతువుల, చిత్రాలు, విగ్రహాలు ఇంటి అలంకరణకు ఉపయోగిస్తూ ఉంటారు. """/" / అయితే ప్రతి జంతువు, పక్షి( Animal, Bird ) కూడా ఏదో ఒక గ్రహానికి చెందినవిగా నమ్ముతారు.

ఆ గ్రహాల ప్రభావం ఇంటి మీద ఎప్పుడు ఉంటుందని ప్రజలు నమ్ముతారు.వాస్తు శాస్త్రంలో( Vastu Shastra ) ఇంటి అలంకరణ గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి.

వాస్తులో ఇంటి అలంకరణకు ఎలాంటి వస్తువులు ఉపయోగించాలి.ఎలాంటి వస్తువులను ఉపయోగించకూడదు, విగ్రహాలైన, చిత్రాలైన ఎలాంటి వస్తువులు అమర్చుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంట్లో ఒక జత ఏనుగులను( Elephants ) అలంకరించడం చాలా శుభంగా భావిస్తారు.

ఏనుగుల జత ఇంట్లో ఉంటే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. """/" / వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.

ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగులు ఉండడం చాలా మంచిది.అంతేకాకుండా ఒక జత బాతుల విగ్రహాన్ని పడక గదిలో పెట్టుకోవడం మంచిది.

ఇలా బాతుల విగ్రహాన్ని( Statue Of Ducks ) అలంకరిస్తే దంపతుల మధ్య ప్రేమ అభిమానాలు పెరుగుతాయని శాస్త్రం చెబుతోంది.

ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఒంటె విగ్రహం అమర్చుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.ఒంటె పోరాట విజయాలకు ప్రతీక.

డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్ లో వాయువ్య దిశలో ఒంటె విగ్రహం ఉంచడం వల్ల చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.

ఉద్యోగ వ్యాపారాలు విజయ పదంలో సాగుతాయి.

ఏపీ సీఎంపై దాడి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్