దమ్ముంటే నేరుగా మాట్లాడాలి..: ముద్రగడ
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మరోసారి విమర్శలు గుప్పించారు.
పవన్ తెరచాటు రాజకీయం చేస్తున్నట్లు మండిపడ్డారు.ఈ క్రమంలోనే సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కు దమ్ముంటే తన గురించి నేరుగా మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు.
అదేవిధంగా పవన్ కు మద్ధతు ఇవ్వాలని కొందరు అంటున్నారన్న ముద్రగడ పవన్ కు తానెందుకు సపోర్ట్ ఇవ్వాలని ప్రశ్నించారు.
గతంలో ముద్రగడను ఎందుకు అవమానించారని చంద్రబాబును( Chandrababu ) పవన్ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.
అనంతరం కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు.
ఆ దేశంలో సైతం విడుదలవుతున్న ఎన్టీఆర్ దేవర.. సంచలన రికార్డులు మాత్రం పక్కా!