రాత్రి సమయంలో ఈ ఒక్క ఆకును నమిలితే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఇవ్వాల్సిందే..!
TeluguStop.com
నేరేడు పండ్లను( Jamun Fruit ) తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వీటి వాసన కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఈ పండ్లు తింటే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
అలాగే వీటి ఆకులను కూడా అంత తేలికగా తీసి పడేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి సమయంలో వీటిని తింటే మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు.ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు( Diabetics ) షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి నేరేడు ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.
మధుమేహం అనేది రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉండడం వల్ల కలిగే దీర్ఘకాలిక పరిస్థితి అని చాలా మందికి తెలుసు.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో,క్లోమం గ్లూకోజ్ ( Pancreatic Glucose ) ను శక్తిగా మార్చడానికి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు.
ఇది జరిగినప్పుడు రక్తంలో అదనపు గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.శరీరం సాధారణంగా పని చేయడం కష్టతరం అవుతుంది.
మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమర్థవంతమైన ఆయుర్వేద హోమ్ రెమిడి ఉంది.
"""/" /
నేరేడు పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండ్ల రసం మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే నేరేడు పండ్ల ఆకులు రక్తంలోని చక్కర ను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడే జాంబోలిన్ ( Jambolin ) వంటి సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
మధుమేహం చికిత్సకు సహజ విధానాల కోసం చూస్తున్న వ్యక్తులకు ఇది ఎంతో మంచిది.
"""/" /
నేరేడు ఆకులు ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి.అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ ప్రభావాలు మెరుగైన బ్లడ్ షుగర్ నియంత్రణకు దోహదం చేస్తాయి.ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
నేరడు ఆకులలో పాలీఫెనాల్స్ ( Polyphenols )వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణ ప్రభావాలను కలిగి ఉంటాయి.
రాత్రి నిద్రపోవడానికి ముందు ఒక్క నేరేడు ఆకును బాగా కడిగి నమలాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఏపీలో ఆ మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇస్తారా.. తప్పు అస్సలు జరగదంటూ?