Vinayaka Mantras : ఈ వినాయక మంత్రాలు జపిస్తే.. ధన లాభం రావడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే ఏ శుభకార్యం జరిగిన ముందుగా వినాయకుడి పూజతోనే ( Lord Ganesha )మొదలవుతుంది.

ఎందుకంటే విఘ్నాలకు అధిపతి విగ్నేశ్వరుడు.కాబట్టి వినాయకుడు జ్ఞానం ప్రసాదించి గొప్ప విజయాలను అందిస్తాడని భక్తులు నమ్ముతారు.

అలాగే మనస్ఫూర్తిగా గణనాథుడిని పూజిస్తే అదృష్టం వరించడంతోపాటు ధనలాభం కూడా సిద్ధిస్తుందని పురాణాలలో ఉంది.

ఇంకా చెప్పాలంటే కోరిన కోరికలు కూడా తీరుస్తాడని చాలా మంది పెద్దవారు చెబుతూ ఉంటారు.

మరి అలాంటి ఏకదంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహం పొందడానికి కొన్ని మంత్రాలు పఠిస్తే మొదలుపెట్టిన పనులలో విజయం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

"""/" / ఆ మంత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం."ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా" అనే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి మొదలు పెట్టిన పనులు అన్ని విజయవంతం అవుతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే జ్ఞానం, సంపద, అదృష్టం, శ్రేయస్సు కూడా లభిస్తాయని చెబుతున్నారు.అలాగే "ఓం గం గణపతాయే నమః"( Om Gam Ganapataye Namah ) అనే ఈ గణేశ మంత్రం చాలా శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు.

"""/" / ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వ్యాపారంలో విజయం సాధిస్తారని చెబుతున్నారు.

అలాగే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే పని విజయవంతమవుతుందని చెబుతున్నారు.

"ఓం గజకర్ణకాయ నమః"( Om Gajakarnakaya Namah )అనే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలాగే ఒత్తిడిని అధిగమించడంలో ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు.అందుకోసమే ఏ శుభకార్యం మొదలుపెట్టిన వినాయకుడు పూజతో మొదలుపెడతారు.

అల్లు అర్జున్ కాళ్ళ ముందు పడ్డ ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ భార్య.. ఏమైందటే?