రూ.99 కి ఇయ‌ర్ ఫోన్స్ కొంటే అకౌంట్ నుంచి 33ల‌క్ష‌లు మాయం..

ప్రస్తుత రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోయింది.

ఏ చిన్న వస్తువు కావాలన్నా కూడా ఆన్ లైన్ పోర్టల్స్ నే ఆశ్రయిస్తున్నారు.

బయటికి వెళ్లి తీసుకొచ్చుకునే ఓపిక అనేది చాలా మందికి నశించింది.అవగాహన లేకుండా ఆన్ లైన్ షాపింగ్ చేయడం వలన మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది.

ఆన్ లైన్ షాపింగ్ చేసి అక్కడ వారు అంత కోల్పోయారు వీరు ఇంత కోల్పోయారనే విషయం గురించి మనం నిత్యం చదువుతూ ఉంటాం.

కానీ వినియోగదారులు మాత్రం మోసాల నుంచి తేరుకోలేకపోతున్నారు.తాజాగా హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఘటన గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ కావాల్సిందే.

మలాలీకి చెందిన ఓ మహిళకు ఇటీవల 50 లక్షల రూపాల ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి.

ఈ డబ్బులతో ఆ మహిళ తన ముగ్గురు పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దాలని భావించింది.

కానీ అనుకోని విధంగా ఆ డబ్బులు చోరీకి గురయ్యాయి.99 రూపాయలు పెట్టి ఆ మహిళ కొన్న ఇయర్ ఫోన్స్ ఆ మహిళకు భారీ కుచ్చు టోపీ పెట్టాయి.

ఇలా 99 రూపాయలు పెట్టి ఇయర్ ఫోన్స్ కొన్న తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ మహిళ అకౌంట్ నుంచి ఏకంగా 33 లక్షల రూపాయలను కొట్టేశారు.

ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. """/" / తన కుమార్తె ఆన్ లైన్ క్లాసులు వినాలని అందుకోసం ఇయర్ ఫోన్స్ అవసరమని భావించిన ఆ మహిళ ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో హెడ్ ఫోన్ల కోసం సెర్చ్ చేసింది.

కానీ వాటిల్లో హెడ్ ఫోన్స్ ధర 500 రూపాయల నుంచి 600 రూపాయలు ఉండడంతో ఆ మహిళ కొనకుండా ఉంది.

కానీ ఒక వెబ్ సైట్ లో హెడ్ సెట్ కేవలం 99 రూపాయలకే రావడంతో ఆ మహిళ ఆర్డర్ చేసింది.

ఇలా చేయడమే ఆ మహిళను ముంచింది.33 లక్షల రూపాయలను అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.

విదేశీ విద్యకు జగన్ పేరును మారుస్తాం..: లోకేశ్