ఇలాంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని దీపావళికి ఇంటికి తెస్తే.. మీ జీవితంలో ఆర్థిక సమస్యలే ఉండవు..!
TeluguStop.com
హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.చీకటి పై వెలుగు సాధించిన విజయానికి ప్రతికగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు.
ఈ సంవత్సరం దీపావళి( Diwali ) పండుగను నవంబర్ నెల 12వ తేదీన జరుపుకొనున్నారు.
పండుగ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పటికే ఇళ్లను శుభ్రం చేయడం, ఇంట్లోనీ పాత వస్తువులను దూరంగా పారేయడం వంటి పనులను చాలామంది ప్రజలు మొదలుపెట్టారు.
అయితే దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహాలను కూడా కొంటూ ఉంటారు.ఈ రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలేమి రావని, ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
"""/" /
అయితే అమ్మవారి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఈ తప్పులు కనుక చేస్తే మీ జీవితంలో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది.మరి ఎలాంటి అమ్మవారి విగ్రహాన్ని కొంటె మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అమ్మవారికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టం.అందుకే మీరు ఈ దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనాలనుకుంటే అమ్మవారు తామర పువ్వు పై కూర్చున్న విగ్రహాన్ని కొనాలి.
అంటే బుడదలో ఉన్న కూడా కమలం ఎంతో అందంగా వికసిస్తుంది.అలాగే ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతికూలతను నివారించాలని ఈ విగ్రహం మనలకు సూచిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం లక్ష్మీదేవి విగ్రహం ఎప్పుడు కూడా కూర్చున్న భంగిమలోనే ఉండాలి.
"""/" /
ఈ భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
అందుకే నిలబడి ఉన్న విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకొస్తే అమ్మవారు మీ ఇంటి నుంచి చాలా త్వరగా వెళ్ళిపోతారని నిపుణులు చెబుతున్నారు.
లక్ష్మీదేవి ( Lakshmi Devi )చేతుల మీదుగా బంగారు నాణేలు వచ్చే విగ్రహాన్ని కొనడం వల్ల ఆర్థిక సమస్యలు అసలు ఉండవు.
అలాగే ఏనుగులు రెండు వైపులా నుంచి డబ్బుల వర్షం కురిపిస్తున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
అలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట్లో ధనానికి లోటే ఉండదు అని చెబుతున్నారు.