కేకుపై క్యాండిల్స్ ఊదితే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంట.. ఎలాగంటే..?
TeluguStop.com
కేక్ కటింగ్ అనేది ప్రస్తుత జనరేషన్ లో సెటబ్రేషన్‌కు ఐకాన్ లాగా మారిపోయింది.
బర్త్ డేల దగ్గరి నుంచి మొదలు పెడితే ఏదైనా సాధిస్తే సెలబ్రేట్ చేసుకునే వరకు.
చిన్న విషయాల దగ్గరి నుంచి పెద్ద విజయాల దాకా అన్నింటికీ అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కేక్ కటింగ్ అనే చెప్పాలి.
ఆ మూమెంట్‌కు తగ్గ కేకు కట్ చేస్తేనే సెలబ్రేషన్స్ సంపూర్ణం అయినట్టుగా ఫీల్ అవుతుంటారు చాలా మంది.
ఎందుకంటే ప్రతి సెలబ్రేటింగ్.మూమెంట్‌కు కేక్ కట్ చేస్తే ఆ ఎంజాయ్ మెంటే వేరే లెవల్ లోనే ఉంటుందని చెప్తుంటారు చాలా మంది.
అయితే ఈ కేకు కటింగ్ వల్ల ఎంజాయ్ మెంట్ ఏమో గానీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు సైంటిస్టులు.
ఎందుకంటే ఆ కేక్ ఊదిన ఆరోగ్యవంతుడైతే అతని తుంపర్లతో వచ్చే బ్యాక్టీరియా వల్ల ఆ కేక్ తిన్నా గానీ పెద్దగా హాని కలగదని చెబుతున్నారు సైంటిస్టులు.
కాబట్టి ఇలా జబ్బులు లేని వ్యక్తి కేకు కోసినా అది తిన్నా మనలోని వ్యాధినిరోధక వ్యవస్థ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెబుతున్నారు.
ఇక్కడే అసలు ట్విస్టు ఏంటంటే ఒక వేళ కేక్ మీద క్యాండిల్స్ ఊదిన వ్యక్తికి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్, ఫ్లూ లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే అంతే సంగతి.
"""/"/
ఎందుకంటే అతని తుంపర్లు కేక్ తిన్న అందరికీ కచ్చితంగా ఆ వ్యాధులు సంక్రమిస్తాయని చెబుతున్నారు సైంటిస్టులు.
ఇలా పడ్డ తుంపర్ల వల్ల ఆ కేకుపై చేరిన బ్యాక్టీరియా కేక్‌లో ఉండే చల్లని క్రీమ్ లేయర్ కారణంగా 15 వేల శాతానికిపైగా త్వరగా పెరిగిపోయి కేక్ మొత్తం వ్యాపించి అది తిన్న వారందరికీ కూడా ఆ రోగాలు అంటుకుంటాయని చెప్తున్నారు.
కాబట్టి ఈ ప్రమాదాల నుంచి బయట పడేందుకు క్యాండిళ్లు ఊదే అలవాటును మానకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి ఇకపై కేకులు కోసే ముందు క్యాండిల్స్‌ను ఊదకండి.
మరోసారి బుక్ అయిన రష్మిక విజయ్ దేవరకొండ… ఇప్పటికైనా ఒప్పుకుంటారా?