ఆన్లైన్లో బెట్టింగ్ చేస్తే.. బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ వలలో చిక్కినట్టే..!

హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయిలో( International Level ) బెట్టింగ్ జరుపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు సరికొత్త మాస్టర్ ప్లాన్ వేసి పట్టుకున్నారు.

కొందరు వ్యక్తులు హైదరాబాదులో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లోని బాచుపల్లి లో సాయి అనురాగ్ అపార్ట్మెంట్లో పదిమంది క్రికెట్ బుకీలను పట్టుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర( CP Stephen Ravindra ) తెలిపారు.

అయితే ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి విజయవాడకు చెందిన పాండు పరారీలో ఉన్నాడని తెలిపారు.

ఈ ముఠా నుంచి రూ.60 లక్షల నగుదు, బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 5.

89 లక్షలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.అంతేకాకుండా బెట్టింగ్ సామాగ్రి, ఫోన్లు, కీ బోర్డ్స్ లాంటి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఎవరైతే సులభంగా డబ్బు సంపాదించాలని అనుకుంటే వారిని టార్గెట్ చేయడమే ఈ ముఠా ప్రధాన లక్ష్యం.

"""/" / అంతేకాకుండ ఆన్లైన్లో బెట్టింగ్ చేస్తే డబ్బులు పోవడంతో పాటు బ్యాంక్ అకౌంట్( Bank Account ) వివరాలు నేరుగా సైబర్ నేరగాళ్లకు చిక్కినట్లే.

ఆన్లైన్లో బెట్టింగ్ చేయడం ఒక రకంగా దొంగ చేతికి తాళం చెవి ఇచ్చినట్లే అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

యువత బెట్టింగ్ల వైపు దృష్టిస్తారిస్తే జీవితం నాశనం అవుతుందని, బెట్టింగ్ అనేది ఒక వ్యసనం, అత్యాశ కోసం లక్షల్లో బెట్టింగ్ పెట్టి చివరకు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నారు.

యువతలో మార్పు రావాలని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు వెతుక్కోవడం సరైనది కాదని పోలీసులు తెలిపారు.

అందరూ కూడా బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ ముఠాలకు దూరంగా ఉండాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని సైబరబాద్ పోలీసులు హెచ్చరించారు.

పెసలతో వారానికి మూడు సార్లు ఇలా చేశారంటే పింపుల్స్ మళ్లీ ఈ వంక కూడా చూడవు!