అప్పులతో సతమతమయ్యేవారు ఇలా చేస్తే ఐశ్వర్యం మీ వెంటే!
TeluguStop.com

డబ్బు కలగాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉండటం సర్వసాధారణం.అటువంటి డబ్బు సంపాదించడం కోసం కొందరు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.


మరికొందరు రెక్కల కష్టం చేస్తూ ఉంటారు.ఎంత సంపాదించినప్పటికీ మన జీవితంలో అప్పులు లేకపోతే ఎంతో ఆనందంగా గడుపుతారు.


మరికొంతమంది ఎంత కష్టపడుతున్నప్పటికి డబ్బును పోగు చేసుకోలేక అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి సతమతమవుతుంటారు.
ఇలా అప్పులు ఉన్న వారికి అప్పులు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలంటే శుక్రవారం ఈ చిన్న పని చేస్తే చాలు.
అయితే అది ఏమిటో తెలుసుకుందాం.ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండాలి.
మహాలక్ష్మి అనుగ్రహం కోసం శుక్రవారం ఐశ్వర్య దీపం వెలిగించాలి.ఐశ్వర్య దీపం శుక్రవారం సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత మరొకసారి వెలిగించాలి.
ఇలా చేయడం వల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మి సంతోషించి, వారి ఇంట అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది.
అయితే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో ఇక్కడకి తెలుసుకుందాం. """/"/
ఐశ్వర్య దీపం వెలిగించడానికి ఇత్తడి ప్లేటు, రెండు ప్రమిదలు, అక్షింతలు, కలకండ, బెల్లం ముక్క, అరటి పండ్లు, తాంబూలం, పసుపు, కుంకుమ, పువ్వులు సిద్ధంగా ఉంచుకోవాలి.
శుక్రవారం ఉదయం అందరూ స్నానాలను ఆచరించి, పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజించాలి.
అమ్మవారి విగ్రహం ముందు బియ్యపు పిండితో పద్మం ముగ్గులు వేసి, ఇత్తడి ప్లేట్లులో ఒక ప్రమిదను ఉంచి అందులో రాళ్ల ఉప్పును, దానిపై అక్షింతలు వేయాలి.
దానిపై నూనెతో వెలిగించిన మరొక ప్రమిదను ఉంచాలి.తరువాత పూలతో ప్రమిద చుట్టూ అలంకరించి పూజలు నిర్వహించాలి.
శ్రీ మహాలక్ష్మి తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు.ఈ విధంగా ఈ పూజను నిర్వహించి ఈ దీపం శనివారం, ఆదివారం వరకు వెలిగేలా చూసుకోవాలి.
తర్వాత ఈ దీపాన్ని చేయడానికి ఉపయోగించిన ఉప్పును ఏదైనా పారుతున్న నీటిలో వదలాలి.
ఇలా చేయడం ద్వారా సాక్షాత్తు మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుందని బాగా విశ్వసిస్తారు.
ఈ విధంగా అమ్మవారిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో గడుపుతారని పండితులు చెబుతున్నారు.
ఇదేం విచిత్రం.. ఇన్‌ఫ్లుయెన్సర్ ఫొటోలు కటౌట్లుగా అమ్మకం.. ఆమెకు తెలిసి మైండ్ బ్లాక్!