Financial Problems : అప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ వాస్తు నియమాలు మీకోసమే..!
TeluguStop.com

కొందరు ఎంత కష్టపడి పని చేసినా చేతిలో డబ్బు నిలువకుండా ఉంటుంది.వీరికి నిత్యం ఆర్థిక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.


అలాగే అప్పులు చేస్తూ ఉంటారు.అప్పులను తీర్చడానికి ఎంత ప్రయత్నించినా అప్పులు పెరిగిపోతూ ఉంటాయి.


అయితే అప్పును తీర్చకపోవడానికి ఇంటి వాస్తులో కూడా లోపాలు ఉంటాయని వాస్తు నిపుణులు( Vastu Experts ) చెబుతున్నారు.
ఇంట్లో ఉండే కొన్ని రకాల వాస్తు దోషాల కారణంగా అప్పుల బాధలు పెరుగుతాయని చెబుతున్నారు.
అయితే రుణ బాధల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
"""/" /
ఇంతకీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు, రుణ బాధలకు కారణమయ్యే వాస్తు దోషాల( Vastu Doshas ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎంతకీ తీరకపోతే ఉత్తరం దిశలో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో చుసుకోవాలి.
ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిశలో ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ఉత్తర గోడకు బీరువా లాంటి భారీ వస్తువులు ఉండకుండా చూసుకోవాలి.
ఉత్తర దిశకు కుబేరుడు( Kubera ) అధిపతిగా చెబుతూ ఉంటారు.దక్షిణ దిశ కూడా కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
"""/" /
అలా కాకుండా ఉతరం వైపు కూడా కొంచెం ఎత్తుగా ఉండి, దక్షిణం వైపు గోడ ఎత్తు తక్కువగా ఉంటే కూడా అప్పుల పాలు అవుతారని చెబుతున్నారు.
అలాగే నైరుతి దిశలో భూగర్భ నీటి ట్యాంకును ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇలా నైరుతి దిశలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
ఇంటి నిర్మాణం సమయంలో ఉత్తర దిశను పూర్తిగా మూసేసి దక్షిణ దిశను ఖాళీగా ఉంచినా కూడా ఆర్థిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అంతే కాకుండా ఈశాన్యంలో ఏవైనా యంత్ర పరికరాలను పెట్టి వాటిని ఉపయోగిస్తున్న వాస్తు దోషం వెంటాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ దిశలో పొరపాటున కూడా బరువైన యంత్ర పరికరాలను పెట్టకూడదు.వీలైనంతవరకు ఈశాన్య దిశను ఖాళీగా ఉంచడమే మంచిది.