మీరు ఎల్‌ఐసీ పాలసీదారులా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..!

మీరు ఎల్‌ఐసీ పాలసీ దారులా? అయితే మీరు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.

ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, డబ్బులు సేవ్ చేయాలన్నా లేదా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్ జరగాలన్నా పాన్ తప్పనిసరి అయింది.

ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ పాలసీని కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ పాలసీని పాన్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని ఎల్‌ఐసీ సూచించింది.

ఎల్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా ఎల్ఐసీ పాలసీని పాన్ కార్డు నంబర్‌తో లింక్ చేసుకోవచ్చు.

దేశీయ దిగ్గజ బీమా రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో అనేక రకాల ఇన్సూరెన్సు పాలసీలను కస్టమర్లకు అందిస్తోంది.

కస్టమర్లు ఎల్‌ఐసీ ద్వారా ఎండోమెంట్, చిల్ట్రన్స్, పెన్షన్, లైఫ్ ఇలా వివిధ రకాల ఎల్‌ఐసీ పాలసీలను ఎంపిక చేసుకోవచ్చు.

అయితే పాలసీ తీసుకున్న తర్వాత మీ పాన్ కార్డును మీ పాలసీతో లింక్ చేయడం మరిచిపోకూడదు.

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేసుకునే గడువును 2022 మార్చి 31 వరకు పొడిగించింది.

ఆ సమయంలోపే ఎల్ఐసీ పాలసీదారులు కూడా పాన్ కార్డు, పాలసీ నంబర్ లింక్ చేసుకోవాలి.

అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడం అంత కష్టమైన పనేం కాదు.మీ దగ్గర పాన్ కార్డు నంబర్, ఎల్‌ఐసీ పాలసీ నంబర్ ఉంటే సరిపోతుంది.

ఈ వివరాలతో మీరు మీ పాలసీని పాన్ కార్డుతో చాలా సులభంగా వేగంగా లింక్ చేసుకోవచ్చు.

"""/" / అదెలాగో తెలుసుకుంటే.మీరు మొదటగా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

తరువాత ఆన్‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.అప్పుడు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.

ఈ విండోలో మీరు పాన్ నంబర్ తో పాటు అవసరమైన అన్నీ వివరాలు ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది.దానిని నమోదు చేసి ఎంటర్ చేస్తే మీ పాన్ కార్డు, ఎల్ఐసీ అకౌంటు అనుసంధానం అవుతాయి.

అయితే పాన్ నెంబర్, ఎల్‌ఐసీ పాలసీ అనుసంధానం అయ్యాయా? లేదా? అనే విషయాన్ని ఎల్ఐసీ వెబ్‌సైట్‌లోనే నిర్ధారించుకోవచ్చు.

ఇందుకు పాన్ పాలసీ లింక్ స్టేటస్ అనే ఆప్షన్ పై నొక్కాలి.తర్వాత మీ పాలసీ నంబర్, డేట్ అఫ్ బర్త్ డే తదితర వివరాలు నమోదు చేసి ఎంటర్ చేయాలి.

అంతే మీ పాలసీ స్టేటస్ వెంటనే మీ ముందుంటుంది.

సుజీత్ నాని తో చేయబోయే సినిమా ఆ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేశారా..?