సినిమాలో యముడు ఉంటే సూపర్ హిట్ కావాల్సిందే.. ఈ ఫార్ములాతో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా?

ఒక సినిమాలో ఒక పాత్ర ఆ సినిమా వరకే ముగుస్తుంది.మళ్లీ ఆ పాత్రను మరో సినిమాలో చూస్తే చాలా బోర్ గా అనిపిస్తుంది.

కానీ ఒక్క పాత్ర మాత్రం ఇప్పటికీ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇంతకు ఆ పాత్ర ఏదో కాదు యముడు పాత్ర.ఈ పాత్ర ఎన్ని సినిమాలలో పెట్టినా కూడా ఎందుకో ప్రేక్షకులు బోర్ కొట్టకుండా చాలా ఆసక్తిగా చూస్తుంటారు.

ఇప్పుడు తగ్గాయి కానీ.ఒకప్పుడు యముడి పాత్రలతో చాలా సినిమాలు వచ్చాయి.

నిజానికి హీరోలు తమ సినిమాలలో ముచ్చటపడి మరి యముడు బ్యాక్ డ్రాప్ తో కథలు సిద్ధం చేసుకునే వారట.

యముడు పాత్ర ఉంటే ఆ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం తమలో బాగా ఉండేదట.

ఎందుకంటే యముడి పాత్ర నుండి వచ్చే మజానే వేరు అని అంటున్నారు ప్రేక్షకులు.

ఇప్పటికీ ఈ యముడు ఫార్ములాతో వచ్చిన సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అయ్యాయో ఓ సారి తెలుసుకుందాం.

యమగోల: 1977లో డైరెక్టర్ తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జయప్రద జంటగా నటించిన సినిమా యమగోల.

ఈ సినిమా కామెడీ పరంగా బాగా హైలెట్ గా మారింది.అంతే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

నటీనటులకు మంచి సక్సెస్ ను అందించింది.యముడికి మొగుడు: 1988లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యముడికి మొగుడు.

ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి, రాధా నటించారు.ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు.

ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. """/"/ యమలీల: 1994లో కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా యమలీల.

ఇందులో ఆలీ, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించారు.ఇక ఈ సినిమా కూడా కామెడీ నేపథ్యంలో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

యమదొంగ: 2007లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా యమదొంగ.ఈ సినిమాకు ఎస్.

ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించాడు.

ఇందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రియమణి, మమతా మోహన్ దాస్ పలువురు నటీనటులు నటించారు.

ఈ సినిమా కూడా కామెడీ, ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.

"""/"/ యముడికి మొగుడు (2012): 2012లో ఈ.సత్తి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యముడికి మొగుడు.

ఈ సినిమాలో అల్లరి నరేష్, రిచా పనాయ్ నటీనటులుగా నటించారు.ఇక సరికొత్త కాన్సెప్ట్ తో ఫుల్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా తెరకెక్కి మంచి సక్సెస్ ను అందుకుంది.

యముడన్న కి మొగుడు: ఇక సుమన్, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో నటించిన సినిమా యముడన్న కి మొగుడు.

ఇక ఈ సినిమా ఎన్నో ఊహలతో విడుదలైంది.కానీ యముడి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఒకటి మాత్రమే అంతగా సక్సెస్ కాలేకపోయింది.

పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చెయ్యాలంటే ఆ మ్యూజిక్ డైరెక్టరే బెస్ట్…