మహిళలు వంటగదిలో ఈ తప్పులు చేస్తే మాత్రం అంతే సంగతి..!
TeluguStop.com
మన గ్రంధాలలో మహిళలను లక్ష్మీదేవితో ( Goddess Lakshmi )సమానంగా భావిస్తారు.మహిళ ఇంటి శక్తికి మూలం అని పెద్దవారు చెబుతూ ఉంటారు.
ఇంట్లో అదృష్టమైన, దురదృష్టమైన వాటన్నిటికీ మహిళలే కారణమని పెద్దవారు చెబుతూ ఉంటారు.మహిళలు తమ రోజువారి పనులలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం వెళ్లి విరుస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.
ఆమె భర్త, సంతానంతో పాటు కుటుంబానికి మేలు చేస్తుందని శాస్త్రాలలో, పురాణాలలో తెలిపారు.
స్త్రీ చేసే ఈ చిన్న పనులు మీ అదృష్టానికి తలుపులు తెరిచి కుటుంబంలో సానుకూల శక్తిని పంచుతాయి.
"""/" / కుటుంబ సంక్షేమం కోసం మహిళలు ( Women )ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలు వంటగదిలోకి ప్రవేశించే ముందు స్నానం చేసి శుభ్రంగా ఉండాలి.స్నానం చేసిన తర్వాతే వంట చేయడం మొదలుపెట్టాలి.
స్నానం చేయకుండా వంట చేయడం శ్రేయస్కరం కాదు.అలా చేయడం వలన అన్నపూర్ణేశ్వరీని, అగ్ని దేవుడుని( Annapurneswari ) అవమానించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలి.ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ధన ధాన్యాలు వృద్ధి చెంది కుటుంబంలో అంతా శుభం జరుగుతుంది.
అంతేకాకుండా వంట చేసేటప్పుడు కోపంగా ఉండకూడదు.కోపంతో ఏమీ మాట్లాడకూడదు.
వంట వండేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. """/" /
ఇలా ఉండడం వల్ల అన్నపూర్ణేశ్వరికి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.
ఇంట్లో కోపం కలహాలు ఉన్నప్పుడు ఆహారం వండడం సంపద, శ్రేయస్సును నాశనం చేస్తుంది.
కాబట్టి వంట చేసేటప్పుడు మనలోని కోపాన్ని ద్వేషాన్ని దూరంగా ఉంచాలి.అలాగే వంట చేసి తిన్న తర్వాత మూతపెట్టిన పాత్రలను ఒంట గదిలో ఉంచకూడదు.
ఈ పాత్రలను పగలు, రాత్రి భోజనం( Lunch , Dinner ) చేసిన తర్వాత శుభ్రంగా కడగాలని శాస్త్రాలలో ఉంది.
చాలామంది రాత్రిపూట తిన్న గిన్నెలను అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేస్తుంటారు.ఇలా చేయడం ద్వారా గ్రహాలు, రాశులు కూడా అశుభ ప్రభావాన్ని కలిగిస్తాయి.
ఇలా చేస్తే ఆనందం, శ్రేయస్సుపై చెడు ప్రభావం చూపుతుంది.అందుకే ఆ పాత్రలో తిన్న వెంటనే శుభ్రం చేయడం మంచిది.
రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి దుర్మరణం.. ఏడాది తర్వాత నిందితురాలి అరెస్ట్