కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే ఆ పార్టీ టిడిపి తో కలవదా..?

ఆంధ్రలో ఎన్నికలు ( Andra Elections )దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ పార్టీలలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి.

ఇప్పటికే అధికారంలో ఉన్న వైసిపి ( YCP ) పార్టీ మళ్లీ గెలవడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న వారిని తీసేసి బలమైన అభ్యర్థులను నిలబెట్టే దిశగా ఆలోచిస్తున్నారు.

ఇక దొరికిందే చాన్స్ అని టిడిపి జనసేన పార్టీలు వైసిపి నుండి ఎవరైతే బయటకు వెళ్తున్నారో వారందరికీ ఆహ్వానం పలుకుతున్నారు.

చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తన రాజకీయ చతురతతో వైసిపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని తన వైపుకు తిప్పుకుంటున్నారు.

అలా ఇప్పటికే జనసేనతో దోస్తీ కట్టారు. """/" / అయితే రీసెంట్ గా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ( DK .

Shiva Kumar ) తో ఎయిర్ పోర్ట్ లో కలిసిన ఫోటోలు మీడియాలో చాలా వైరల్ గా మారాయి.

అంతే కాదు వీరిద్దరూ రహస్య మంతనాలు కూడా జరిపారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే టిడిపి జనసేనతోపాటు కాంగ్రెస్ ని కూడా కలవాలని ముగ్గురు కలిసికట్టుగా ఎన్నికల బరిలో నిలిచి వైసిపి పార్టీని ఓడగోట్టాలి అని మాట్లాడుకున్నారు అంటూ నెట్టింట్లో చంద్రబాబు గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

"""/" / అయితే చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్తోనే కాదు బిజెపితో కూడా జతకట్టాలని చూస్తున్నారు.

అయితే బిజెపి అధిష్టానం ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది.అయితే బిజెపి అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandareshwari ) మాత్రం టిడిపి పార్టీతో జతకట్టాలని ఎన్నో మంతనాలు చేస్తున్నప్పటికీ అది జరగడం లేదు.

ఇక సంక్రాంతి తర్వాత బిజెపి పార్టీ టిడిపి జనసేనతో కలుస్తుందా లేదా అనేది ఒకక్లారిటీ వచ్చేలా ఉంది.

అయితే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కూడా సన్నిహితంగా మెదిలేసరికి బిజెపి పార్టీకి అంతగా నచ్చడం లేదట.

ఎందుకంటే నేషనల్ పార్టీస్ అయినా బిజెపి, కాంగ్రెస్ కలవడం అస్సలు జరగదు.ఒకవేళ చంద్రబాబు నాయుడు గనుక కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే కచ్చితంగా బిజెపి పార్టీ వీరికి వ్యతిరేకంగా ఉంటుంది.

అలాగే ఎన్నికల్లో ఒంటరిగానైనా లేదా పరోక్షంగా జగన్ (Jagan) కి అయినా సపోర్ట్ చేస్తుంది కానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టిడిపి జనసేనతో మాత్రం కలవదు.

ఇలా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు కావాలనుకుంటే బిజెపిని బిజెపితో పొత్తు కావాలి అనుకుంటే కాంగ్రెస్ ని వదులుకోక తప్పదు.

ఆ హామీతో … కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి  ?