మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' హిట్ అయితే ఏం జరుగుతుందో తెలుసా!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు బాబీ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.
రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఈ సినిమా దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు.
ఈ సమయంలోనే వాల్తేరు వీరయ్య సినిమా విడుదల """/"/ అయ్యి భారీ విజయం సాధిస్తే ఏం జరగబోతుంది అనే విషయమై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా కనుక భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే చిరంజీవి వెంట వెంటనే రెండు సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయట.
ఇప్పటికే భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఆ సినిమా ఆగస్టు కు అనుకున్నా కూడా ముందే అంటే సమ్మర్ లోనే విడుదల చేయాలని భావించే అవకాశం ఉంది.
"""/"/
అంతే కాకుండా మరో సినిమాకు కమిట్ అయ్యి మూడు నాలుగు నెలల్లోనే షూటింగ్ కూడా ముగించి సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ ఏడాది చిరంజీవి నుండి మూడు సినిమాలు విడుదల అయితే కచ్చితంగా ఫ్యాన్స్ కు పండగే అంటూ మెగా కాంపౌండ్ వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు స్థాయి లో వాల్తేరు వీరయ్య సినిమా యొక్క కలెక్షన్స్ నమోదు అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అన్నీ కూడా కమర్షియల్ సినిమా లు మాత్రమే చేయాలని అభిమానులు చిరంజీవిని కోరుకుంటున్నారు.
చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
చిరంజీవి నుండి ఈ ఏడాది ఎన్ని సినిమాలు వచ్చేనో చూడాలి.
కృష్ణ వంశీ తో పెళ్లికి ముందు రమ్యకృష్ణ జీవితంలో ఆ డైరెక్టర్ ఉన్నారా ?