విక్రమ్ తంగలన్ హిట్ అయితే మరో భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడా..?

తమిళ్ సినిమా( Tamil Movie ) ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు.

అందులో ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్( Rajinikanth, Kamal Haasan ) లాంటి దిగ్గజ నటులు ఆ ఇండస్ట్రీలో ఉండటం అలాగే వాళ్ళు ఇప్పటికీ సినిమాలు చేస్తు ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక వీళ్ల తర్వాత విజయ్, సూర్య లాంటి నటులు కూడా ఉన్నారు. """/" / వీళ్ళు వైవిధ్యమైన కథాంశాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటూ తమిళంలో వాళ్ళకంటూ ఒక క్రేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నారు.

ఇక వీళ్ళ తో పాటుగా "చియన్ విక్రమ్" ( Chian Vikram )కూడా వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఒక పాత్ర కోసం ఏం కావాలో అది చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు.

అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.

అయితే ఆయన ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ అందులో సక్సెస్ లు మాత్రం చాలా తక్కువగా వస్తూ ఉంటాయి.

అందువల్లే ఆయన మార్కెట్ అనేది స్టెబుల్ గా ఉండిపోయింది తప్ప అది పెరగడం కానీ, తగ్గడం కానీ చేయడం లేదు.

"""/" / దానివల్ల ఆయన ఇప్పుడు తన ప్రాణాలకు తెగించి మరీ రిస్క్ చేసి 'తంగలన్ ' సినిమా( Thangalan ) చేస్తున్నారు.

దానికోసం తన బాడీ అవుట్ ఫిట్ మొత్తాన్ని మార్చేసినట్టుగా ఆ సినిమా టీజర్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది.

ఇక అలాంటి ఒక ఔట్ ఫిట్ రావడానికి ఆయన చాలా రోజుల పాటు కష్టపడ్డాడట.

దానికోసం ఏకంగా తన ప్రాణాలకు రిస్కు కలిగించే పనులను కూడా చేశారట.ఈ సినిమా కనక హిట్ అయితే ఇప్పుడు ఆయన మరో భారీ ప్రాజెక్టుని లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

మురుగ దాస్ డైరెక్షన్ లో ఒక భారీ గ్రాఫికల్ సినిమాని కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం మురుగదాస్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు.కాబట్టి ఆ సినిమా తర్వాత ఈ సినిమా ఉండబోయే అవకాశాలైతే ఉన్నాయి.

ప్లీజ్ నాకు రాజకీయరంగు పుయ్యద్దు…అవకాశాలను కోల్పోతున్నాను: సింగర్ మంగ్లీ