వెంకటేష్ లేకుంటే బాగుండేది.. ఓరి దేవుడాపై పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఓరి దేవుడా.

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ దేవుడి పాత్రలో సందడి చేశారు.ఇలా దీపావళి కానుకగా విడుదలైనటువంటి ఈ సినిమా థియేటర్లో మిశ్రమ స్పందన దక్కించుకుంది.

ఇకపోతే తాజాగా విశ్వక్ నటించిన ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో తన విశ్లేషణను తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఓరి దేవుడా చిత్రాన్ని తమిళంలో ఎంతో విజయవంతమైనటువంటి ఓ మై కడువులే సినిమాని తెలుగులోకి రీమేక్ చేశారు.

ఇక ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలకు ఈ విధమైనటువంటి టైటిల్స్ పెట్టడం చాలా గొప్ప సాహసం అని ఈయన వెల్లడించారు.

ఇలాంటి సినిమాలలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడం చాలా కష్టమని అయితే ఇందులో ఏ విధమైనటువంటి చిన్న తప్పు దొర్లిన ప్రేక్షకులతో కనెక్టివిటీ పోతుందని ఈయన తెలిపారు.

ఈ సినిమాలో అలాంటి తప్పులు దుర్లాయేమోనని ఈయన సందేహం వ్యక్తం చేశారు.ఇక చిన్ననాటి స్నేహితుల మధ్య జరిగిన ప్రేమ కథ గురించి ఈ సినిమాలో చూపించారు.

అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలో వస్తున్నాయని ఇలా లవ్ స్టోరీ తో వచ్చిన సినిమాలు మంచిగానే ఆదరణ పొందుతున్నాయని తెలిపారు.

"""/"/ ఈ సినిమా మధ్యలో కొన్ని సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.అలాగే క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉందని పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ మధ్యకాలంలో చాలామంది భార్య భర్తలు విడిపోవాలని లేకున్నా కోర్టు వరకు వస్తున్నారని విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

అయితే ఈ సినిమాకు ఓరి దేవుడా అనే టైటిల్ కరెక్ట్ కాదేమోనని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

"""/"/ ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేదని తెలిపారు ఇక వెంకటేష్ పాత్ర గురించి మాట్లాడుతూ వెంకటేష్ ఈ సినిమాలో దేవుడి పాత్రలో నటించారా లేక దేవుడికి ప్రతినిధి పాత్రలో నటించారా అర్థం కాలేదని తెలిపారు.

నిజానికి ఈ సినిమాలో వెంకటేష్ లాంటి హీరోలను పెట్టుకోవడమే పెద్ద తప్పు.ఇలాంటి కామెడీ తరహా పాత్రలలో వెంకటేష్ లాంటి స్టార్ హీరోలను తీసుకొని వారి హోదాను తగ్గించినట్లు అవుతుందని ఈయన భావించారు.

ఈ సినిమాలో వెంకటేష్ కి బదులుగా రాజేంద్రప్రసాద్ వంటి హీరోలను తీసుకొని ఉంటే బాగుండేదని తెలిపారు.

అద్భుతమైన కథాంశంతో ఆకాశాన్ని చేరుకోవాల్సినటువంటి ఈ సినిమా కొన్ని లోపాల కారణంగా మధ్యలోనే ఆగిపోయిందని ఈయన ఓరి దేవుడా సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో యోధుడు అంటే పవన్.. తేజ సజ్జా కామెంట్స్ వైరల్!