హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే ? కేటిఆర్ దశ తిరిగినట్టే ?

హుజురాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ భవిష్యత్తును మార్చేలా కనిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేయాలి ? ఓటమి చెందితే ఏం చేయాలనే విషయంపై ఇప్పటికీ కెసిఆర్ పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఫలితం ఎలా ఉన్నా దానికి అనుగుణంగా నిర్ణయాలు ముందుగానే తీసుకున్న కేసీఆర్ వాటి ఫలితాలు వెలువడిన అనంతరం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుంది అనే ధీమా ఒక పక్క కెసిఆర్ లో నెలకొన్నా,  ఈటెల రాజేందర్ ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం,  ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ కనుక గెలిస్తే,  కెసిఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ను టిఆర్ఎస్ అధ్యక్షుడిగా  చేయడంతో పాటు,  ఆయనను ముఖ్యమంత్రిగా చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లుగా ఇప్పుడు టీఆర్ఎస్ లో హడావుడి నెలకొంది.

     హుజూరాబాద్ నియోజకవర్గం లో బలమైన నాయకుడుగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఓడిస్తే ఇక తమకు రాబోయే రోజుల్లోనూ తిరుగు ఉండదు అనే లెక్కల్లో కెసిఆర్ ఉన్నారు.

అందుకే ఫలితం అనుకూలంగా వస్తే తెలంగాణ పార్టీ బాధ్యతలు, ముఖ్యమంత్రి పీఠం అన్ని కేటీఆర్ కు అప్పగించి,  తాను జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనే ఆలోచన లో కెసిఆర్ ఉన్నారట.

ఈ మేరకు ఈ నెల 17వ తేదీన తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.

ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీలో కీలక నాయకులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని టిఆర్ఎస్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

  """/"/   ఇప్పటికే కేటీఆర్ ను టీఆర్ఎస్ అధ్యక్షుడిని చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ మేరకు ఈనెల 25వ తేదీన ఒక క్లారిటీ కూడా రాబోతోంది.

ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ ను ముందుకు తీసుకు వెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ కూడా కేసీఆర్ సిద్ధం చేశారట.

ఏది ఏమైనా హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే కేటీఆర్ రాజకీయ దశ తిరిగినట్టే అనే చర్చ ఇప్పుడు టీఆర్ఎస్ లో నెలకొంది.

వైయస్ వివేక హత్యపై కడప కోర్టు సంచలన తీర్పు..!!