ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే.. మీ ఇంట్లో ఇక లక్ష్మీ తాండవమే..
TeluguStop.com
హిందూ సంప్రదాయాలలో చెట్లను పూజించడం ఒక ఆనవాయితీ.ఇందులో మారేడు చెట్టుకు మరింత ప్రాధాన్యం ఉంది.
అయితే మారేడు చెట్టు సాక్షాత్తు పరమశివుడికి( Lord Shiva ) ఇష్టమైన చెట్టుగా పేర్కొనబడింది.
అందుకోసమే శివ పూజలో కూడా మారేడు దళాలు ప్రధానమైనవిగా ఉంటాయి.వీటితో పరమశివుడిని పూజిస్తే పరమశివుడు సంతోషించి మనకు సకల సౌభాగ్యాలు ఇస్తాడని నమ్మకం.
అయితే ఈ చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చా? లేదా? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి.
"""/" / అయితే మారేడుకు( Maredu Tree ) ఓ విశిష్టత ఉంది.
రామాయణాన్ని రాసిన వాల్మీకి ఓ దొంగ అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.
అతడు ప్రతిరోజు వేటకు వెళ్లేవాడు.ఒకరోజు తను వేటకు వెళ్ళిన సమయంలో మారేడు చెట్టు ఎక్కి కూర్చుని జంతువు దొరుకుతుందా లేదా అని ఒక్కో ఆకు తెంపుకుంటూ వేస్తాడు.
అప్పుడు చెట్టు కింద శివలింగం ఉంటుంది.అతడు వేసిన ఆకులన్నీ లింగం పై పడతాయి.
ఇలా అతడికి పుణ్యం లభించి ఋషిగా మారిపోతాడు.ఇది మారేడు చెట్టు విశిష్టత.
అందుకే దాన్ని పూజలకు ఎక్కువగా ఉపయోగిస్తాం.మారేడు చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ప్రతి చెట్లకు పూలు పుసి కాయలు కాస్తాయి.
"""/" /
కానీ మారేడుకు మాత్రం నేరుగా కాయలే కాస్తాయి.శివుడికి పూజ చేసేటప్పుడు వీటితో పూజ చేస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది.
అయితే ఈ ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు.కేవలం బుధా, శనివారాలు మాత్రమే కోయాలి.
అలాగే అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, సంక్రాంతి, శివరాత్రి పండుగ రోజులలో అస్సలు కోయకూడదు.
అంతకంటే ముందు రోజే వాటిని తీసుకోవాలి.ఈరోజు వాడని ఆకులను మళ్లీ రేపు కడిగి వాడవచ్చు.
ఇక మారేడు చెట్టు ప్రదక్షణను అలాగే దాన్ని తాకితే సాక్షాత్తు పరమశివుడు తాకినట్లే.
అందుకే ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే మనకు ఎప్పటికీ మంచి జరుగుతుంది.