ఈ పొడిని రోజు పాలల్లో కలిపి తీసుకుంటే నిద్రలేమిని తరిమికొట్టవచ్చు!
TeluguStop.com
నిద్రలేమి.ఇటీవల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని తీవ్రంగా కలవర పెడుతున్న సమస్య ఇది.
నిద్రలేమి.చిన్న సమస్యే అయినప్పటికీ నిర్లక్ష్యం చేశామంటే అదే ప్రాణాలకు ముప్పుగా మారుతుంది.
నిద్రలేమి వల్ల అధిక బరువు, గుండె జబ్బులు, మెదడు పనితీరు మందగించడం, జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడం ఇలా ఎన్నో సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి.
అందుకే నిద్రలేమిని వదిలించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటాయి.అయితే ఇప్పుడు చెప్పబొయే పొడిని రోజు పాలల్లో కలిపి తీసుకుంటే నిద్రలేమిని సులభంగా తరిమికొట్టవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడి ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో పదిహేను బాదం పప్పులు, గుప్పెడు పల్లీలు, మూడు టేబుల్ స్పూన్ల సన్ ఫ్లవర్ సీడ్స్, మూడు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, రెండు టేబుల్ స్పూన్ల సోయా బీన్స్, గుప్పెడు వాల్ నట్స్‌ను ఒకదాని తర్వాత మరొకటి వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న పదార్థాలను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో అన్నిటినీ వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.
ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడి, కొద్దిగా బెల్లం తురుము వేసుకుని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు లేదా తర్వాత తీసుకోవాలి.
"""/"/
ఇలా ప్రతి రోజు గనుక చేస్తే నిద్రలేమి సమస్య క్రమంగా దూరం అవుతుంది.
నిద్ర నాణ్యత రెట్టింపు అవుతుంది.అదే సమయంలో రక్తహీనత పరార్ అవుతుంది.
మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
ఎముకలు బలోపేతం అవుతాయి.బ్రెయిన్ షార్ప్ గా కూడా పని చేస్తుంది.
వాళ్ల ఓవరాక్షన్ ముందు మా యాక్షన్ చాలట్లేదు.. బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్ వైరల్!