మీ పిల్ల‌ల మెదడు షార్ప్‌గా మారాలా? అయితే వారి డైట్‌లో దీన్ని చేర్చండి!

చ‌దువుల్లో, ఆట‌-పాట‌ల్లో పిల్ల‌లు బాగా రాణించాలంటే వారి మెద‌డు ఎంతో షార్ప్‌గా ఉండాలి.

అందుకే పిల్ల‌ల శారీర‌క ఎదుగుద‌ల‌పైనే కాదు.మాన‌సిక ఎదుగుద‌లపై కూడా త‌ల్లిదండ్రులు దృష్టి సారించాలి.

పిల్ల‌ల మెదడు చురుగ్గా మారేందుకు స‌హ‌క‌రించే ఆహారాల‌ను ఇవ్వాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను మీ పిల్ల‌ల డైట్‌లో చేరిస్తే.

వారి మెద‌డు సూప‌ర్ షార్ప్‌గా మార‌డం ఖాయం.మ‌రి పిల్ల‌ల మెదడును చురుగ్గా మార్చే ఆ జ్యూస్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక యాపిల్‌, ఒక కీర‌దోస కాయ‌, ఒక క్యారెట్ తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు క్యారెట్ ముక్క‌ల‌ను మాత్రం ప‌ది నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకుని.చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఉడికించి చ‌ల్లార‌బెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, యాపిల్ ముక్క‌లు, కీర‌దోస కాయ ముక్క‌లు, రెండు వాట‌ర్‌లో క‌డిగిన‌ పుదీనా ఆకులు, ఒక గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో రుచికి స‌రిప‌డా తేనెను మిక్స్ చేస్తే.హెల్తీ అండ్ టేస్టీ జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఈ జ్యూస్‌ను పిల్ల‌ల చేత బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తాగించాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే క్యారెట్, యాపిల్, కీర‌లో ఉండే అమోఘ‌మైన పోష‌కాలు పిల్ల‌ల మెద‌డును షార్ప్‌గా మారుస్తుంది.

వారిలో జ్ఞాప‌క శ‌క్తి, ఆలోచ‌న శ‌క్తిని రెట్టింపు చేస్తాయి. """/" / అంతేకాదు, ఈ క్యారెట్-యాపిల్-కీర జ్యూస్‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల కంటి చూపు రెట్టింపు అవుతుంది.

ర‌క్త‌హీనత స‌మస్య ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.రోజంతా యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య వేధించ‌కుండా ఉంటుంది.మ‌రియు ఎముక‌లు సైతం దృఢంగా త‌యార‌వుతాయి.

వంశీ పైడిపల్లి బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడా..?