ఈ ఒక్కటి డైట్ లో ఉంటే పది రోజుల్లో రక్తహీనత పరార్ అవుతుంది!
TeluguStop.com
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇటీవల కాలంలో కోట్లాది మంది రక్తహీనత సమస్య బారిన పడుతున్నారు.
రక్తహీనత అనుకున్నంత చిన్న సమస్య అయితే ఏమీ కాదు.రక్తహీనతను ఎంత నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు అంత పెరుగుతుంది.
అందుకే రక్తహీనతను వీలైనంత త్వరగా వదిలించుకునేందుకు ప్రయత్నించాలని ఆరోగ్యాన్ని నిపుణులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే రక్తహీనత నుంచి బయటపడటం కోసం చాలా మంది మందులు వాడతారు.
అయితే సహజంగా కూడా ఈ సమస్యను తరిమికొట్టొచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో కనుక చేర్చుకుంటే పది రోజుల్లోనే రక్తహీనత పరార్ అవుతుంది.
మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
"""/"/
అలాగే ఒక హాఫ్ కీర దోసకాయను తీసుకుని వాటర్ తో కడిగి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, కీర స్లైసెస్, అర అంగుళం పొట్టు తొలగించిన పచ్చి పసుపు కొమ్ము, ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పాలకూర ఆకులు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన బీట్ రూట్ కీరా పాలక్ జ్యూస్ సిద్ధమవుతోంది.
"""/"/
ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున ఈ జ్యూస్ ను తీసుకుంటే శరీరానికి అవసరం అయ్యే ఐరన్ లభిస్తుంది.
హిమోగ్లోబిన్ శాతం రెట్టింపు అవుతుంది.దాంతో రక్త వృద్ధి జరుగుతుంది.
ఫలితంగా కొద్ది రోజుల్లోనే రక్తహీనత సమస్య దూరం అవుతుంది.కాబట్టి ఎవరైతే రక్తహీనత సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా చేర్చుకోండి.
ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!