చైత్రమాసంలో ఈ పనులు చేస్తే.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సిందే..?

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం మార్చి 27 నుంచి మొదలై, ఏప్రిల్ 23వ తేదీన ముగిసిపోతుంది.

శాస్త్రల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ మాసంలో విశ్వసృష్టిని మొదలు పెట్టాడని పండితులు చెబుతున్నారు.

హిందూమతంలో చైత్రమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఎందుకంటే నవరాత్రి, రామ నవమి, పాప మోషిని ఏకాదశి, హనుమాన్ జయంతి వంటి అనేక ప్రధాన పండుగలు ఉపవాసాలు ఈ మాసంలో జరుగుతాయి.

మత గ్రంధాల ప్రకారం చైత్రమాసం( Chaitra Masam )లో కొన్ని పనులు చేయడం నిషిద్ధం అని పండితులు చెబుతున్నారు.

"""/" / ఈ మాసంలో ఈ నిషేధిత పనులు చేయడం వల్ల ప్రజల జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

చైత్ర మాసంలో ఏ ఏ పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.చైత్రమాసంలో ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శాంతి ఉండేలా లక్ష్మీదేవి, దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి కొన్ని ప్రత్యేక చర్యలు చేయాలి.

ఎందుకంటే ఈ మాసం దుర్గాదేవి( Goddess Durga )కి అంకితం చేయబడింది.నవరాత్రుల కారణంగా చైత్రమాసం అంతా భగవతి దేవిని పూజిస్తారు.

ముఖ్యంగా చెప్పాలంటే చైత్రమాసంలో పొరపాటున కూడా తామసిక ఆహారం తీసుకోకూడదు. """/" / చైత్రమాసంలో ఈ ఆహారం తినడం వల్ల సంపదకు అదిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది.

దీనివల్ల మీ జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ మాసంలో బెల్లం తినకూడదు.

బెల్లం ప్రకృతిలో వేడిగా ఉంటుంది.కాబట్టి వేసవిలో బెల్లం ( Jaggery )తీసుకోవడంఆరోగ్యానికి మంచిది కాదు.

చైత్రమాసంలో జుట్టు కత్తిరించడన్ని నిషేధించారు.ఈ మాసంలో జుట్టు కదిరించడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చైత్ర మాసంలో ఇంట్లో గొడవలు అస్సలు చేయకూడదు.భార్య భర్తలు ఎలాంటి వివాదాలకు, వాదనలకు దిగకూడదు.

ఇంటి మహిళ లక్ష్మీ స్వరూపం అని నమ్ముతారు.అందుకే ఈ మాసంలో పొరపాటున కూడా గొడవలు పెట్టుకోకూడదు.

వేదాలు పురాణాల ప్రకారం చైత్రమాసం మొదటి రోజు చాలా పవిత్రమైనదిగా ప్రకటిస్తారు.అందుకే ఈ రోజు ఏదైనా కొత్త పని చేయడం మంచిదని భావిస్తారు.

ఎవరీ నిహారిక ఎన్ఎమ్.. గీతా ఆర్ట్స్ సినిమాలోని ఆఫర్ పొందడం ఆమె అదృష్టమా..??