ఇవి కుందేళ్లు అనుకుంటే పప్పులో కాలేసినట్టే... భయంకరమైన ఎలుకలు ఇవే!

ఇక్కడ ఫోటో చూస్తే కనిపిస్తున్నవి కుందేళ్లు అనే అనుకుంటున్నారు కదూ.ముద్దుముద్దుగా ఉన్న వీటిని చూస్తుంటే, చేతుల్లోకి తీసుకొని ఆడించాలని అనిపిస్తుంటుంది కదా.

అలాని పొరపాటున కూడా మీరు మీ చేతుల్లోకి తీసుకోకండి.ఎందుకంటే లటుక్కున అవి మిమ్మల్ని కరవడం ఖాయం.

అదేంటి కుందేళ్లు ఎందుకు కరుస్తాయి? అనే అనుమానం మీకు సందేహం కలగొచ్చు.కానీ ఇది నిజం అవి తప్పకుండా కరుస్తాయి.

ఎందుకంటే ఇవి కుందేళ్లు కాదు.అచ్చం వాటిలాగే కనిపిస్తున్న ఎలుకలు.

వీటికి ఉన్న మరో విశిష్టత ఏంటంటే, వీటికి తోకలు వుండవు.నిజం.

కుందేళ్ల మాదిరిగా ముద్దుముద్దుగా కనిపిస్తున్న ఈ జీవుల్ని 'గినియా పిగ్స్‌' అని అంటారు.

కరీంనగర్‌లోని జింకల పార్కులో వీటిని పెంచుతున్నారు.విభిన్న వర్ణాల్లో ఉండటంతో ఇవి జనాలను ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా అక్కడకు వెళ్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు వాటిని చూపిస్తూ అందిస్తున్నారు.ఇక ఆపిల్లలైతే వాటిని చూస్తూ కేరింతలు కొడుతున్నారు.

కరీంనగర్‌ మహిళా డిగ్రీ కళాశాల జువాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.సంగీతారాణి వీటి గురించి వివరించారు.

గినియా పిగ్స్‌ 16వ శతాబ్దం నుంచీ కనబడుతున్నాయన్నారు.గినియా పిగ్స్ అనేవి కావిడే కుటుంబంలోని కేవియా జాతికి చెందిన ఎలుకలని, 3 నెలలకు ఒక ఈత చొప్పున సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయని చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఇవి కుందేళ్ళలాగా పూర్తిగా శాకాహారులని, మాంసాహారం అస్సలు ముట్టవని అన్నారు.అయితే వీటికి మామ్మూలు ఎలుకల్లాగా తోకలుండవని వివరణ ఇచ్చారు.

ఇక వీటిని దక్షిణ అమెరికా ఇళ్లల్లో, మనం కుక్కల్ని పెంచుకున్నట్టు పెంచుకుంటారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

అయితే వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి మార్కెట్ ఉందని అన్నారు.వీటిని పెంచుకోవడానికి ఫారినర్స్ ఎక్కువగా ఉత్సాహం చూపుతారని సమాచారం.

Viral : కోతుల దెబ్బకి గోరిల్లాలా మారిన గ్రామ పంచాయతీ కార్యదర్శి.. అసలు మ్యాటరేంటంటే…?!