పాలకూర సాగులో ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే అధిక దిగుబడి..!

ఆకుకూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఏ ఆకుకూరను సాగు చేసినా కూడా రైతులు( Farmers ) మంచి ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు.

మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆకుకూరల్లో పాలకూర( Spinach ) ఒకటి.పాలకూర సాగు( Spinach Cultivation ) విధానం పై అవగాహన ఉండి, కొన్ని మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడి సాధించి మంచి లాభం పొందవచ్చు.

ఆకుకూరలు సాగు చేయడానికి ఎక్కువ విస్తీర్ణం అవసరం లేదు.మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా సాగు చేస్తేనే మంచి ధర పొందవచ్చు.

పాలకూర సాగు చేసే విధానం లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. """/" / ముందుగా పాలకూర సాగు( Spinach Cultivation ) చేసే నేలల విషయానికి వస్తే.

మురుగునీరు పోయే సౌకర్యం ఉండే అన్ని నేలలు ఈ పంట సాగుకు అనుకూలం.

నీరు నిల్వ ఉండే నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండవు.పొలంలో నీటి సౌకర్యం ఉంటే సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఎప్పుడైనా ఈ పంటను సాగు చేసుకోవచ్చు.

పాలకూరలలో చాలా రకాలే ఉన్నాయి.జాబనర్ గ్రీన్, పూసా పాలక్, పూసా హరిత్ రకాలలో ఏ రకం సాగుచేసిన మంచి దిగుబడి పొందవచ్చు.

"""/" / పొలంలో పాలకూర మొక్కలకు గాలి, సూర్యరశ్మి బాగా తగిలే విధంగా మొక్కల మధ్య దూరం ఉండేలా విత్తుక్కోవాలి.

పంట విత్తిన 20 రోజుల తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి కచ్చితంగా కలుపు నివారణ, అంతర కృషి చేయాలి.

నేలలోని తేమశాతాన్ని బట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు నీటి తడులు అందించాలి.

పాలకూర నాటిన 8 వారాల తర్వాత పంట కోతకు సిద్ధం అవుతుంది.పాలకూర సాగుకు ఆశించే తెగుళ్ల( Pests ) విషయానికి వస్తే.

పేనుబంక, రసం పీల్చే పురుగుల బెడద చాలా ఎక్కువ.పొలంలో వీటిని గుర్తించిన వెంటనే ఒక లీటరు నీటిలో రెండు గ్రాముల మలాథియాన్( Malathion ) ను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.

పిచికారీ చేసిన వారం రోజుల వరకు పంట కోతలు చేయకూడదు.

రాజకీయాలలో నాకు ఎలాంటి ఆశలు లేవు.. నా జీవితం వాళ్లకే అంకితం: నాగబాబు