ఈ హీరోలు కలిసి నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్టేనా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే యంగ్ హీరోలు కూడా వాళ్లకు ఏమాత్రం తగ్గకుండా మంచి సినిమాలను చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ స్టార్ డమ్ ని పొందడమే కాకుండా వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో  అద్భుతమైన విజయాలను అందుకుంటున్న విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ప్రస్తుతం వీళ్ళతోపాటు మరొక హీరో కూడా పోటీకి వస్తున్నాడు  ఆయన ఎవరు అంటే ప్రియదర్శి.

"""/" / ప్రస్తుతం ప్రియదర్శి కూడా హీరోగా కొన్ని సినిమాలు సైన్స్ చేశాడు.

ఇక అందులో ఇంద్రగంటి మోహన కృష్ణ( Mohana Krishna Indraganti ) గారి సినిమా ఉండడం విశేషం.

నాని లాంటి హీరో ను ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రస్తుతం ప్రియదర్శితో సినిమా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోవాలని ప్రియదర్శి చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా హిట్ అయితే ప్రియదర్శి కి కూడా మంచి పేరు వస్తుంది.

"""/" / ఇక ఇదిలా ఉంటే వీళ్ళు ముగ్గురితో పాటు వీళ్ళ కంటే ముందే స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ కూడా చాలా వరకు సక్సెస్ లను అందుకున్నాడు.

ఇక ఇప్పుడు అభిమానులందరూ విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ ఒకే సినిమాలో నటించి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ ప్రేక్షకులను అలరిస్తే సినిమా సూపర్ గా ఉంటుంది అంటూ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

అంటే అర్జున్ రెడ్డి, డీజే టిల్లు, మస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మూడు క్యారెక్టర్లు లింక్ చేస్తూ ఒక కథ రాస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మారుతీ నగర్ సుబ్రమణ్యం రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?