ఈ పండ్లు డైట్‌లో ఉంటే గ్యాస్ సమస్యే ఉండదట..!
TeluguStop.com
గ్యాస్ ట్రబుల్.తరచూ ఇబ్బంది పెట్టే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.
అందులోనూ ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో ఈ సమస్య మరింత ఎక్కువగా సతమతం చేస్తుంటుంది.
గ్యాస్ అనేది చిన్న సమస్యనే అయినా.మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది.
అలాగే గ్యాస్ కారణంగా పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆయాసం, తేన్పులు వంటివి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయి.
దీంతో ఈ సమస్య నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.
అయితే న్యాచురల్‌గా కూడా ఈ సమస్యను వదిలించుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పండ్లను డైట్‌లో చేర్చుకుంటే అసలు గ్యాస్ సమస్యే దరి చేరకుండా ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం పదండీ.కివీ పండు.
దీని ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.చూసేందుకు సపోటా పండు మాదిరి ఉండే కివీ పండును రోజుకు ఒకటి చప్పున తీసుకుంటే.
అందులో ఉండే పోషక విలువలు జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చి గ్యాస్ సమస్యను దరి దాపుల్లోకి రాకుండా అడ్డు కట్ట వేస్తాయి.
అలాగే కివీ పండును డైట్‌లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రోంగ్‌గా మారుతుంది.కంటి చూపు పెరుగుతుంది.
క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. """/" /
అలాగే గ్యాస్ సమస్యకు దూరంగా ఉండాలనుకుంటే తీసుకోవాల్సిన మరో పండు అంజీర్.
కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త పులువు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ప్రతి రోజు ఒకటి, రెండు అంజీర్ పండ్లను తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
మరియు మలబద్ధకం సమస్య ఉన్నా దూరం అవుతుంది.ఇక గ్యాస్ సమస్య నుంచి రక్షిండంలో అరటి పండు సైతం సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.
ఒక అరటి పండు చప్పున ప్రతి రోజు తీసుకుంటే.అందులో ఉండే ఫైబర్ కంటెంట్ డైజస్టివ్ సిస్టమ్‌ను వేగవంతం చేస్తాయి.
తద్వారా గ్యాస్ సమస్య దరి చేరకుండా ఉంటుంది.
హెయిర్ బ్రేకేజ్ తో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టండి!