ఈ ఫుడ్స్ డైట్‌లో ఉంటే మీ దంతాలు రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే..?!

దంతాలు ఆరోగ్యంగా, గ‌ట్టిగా ఉండాలీ అంటే ఖ‌రీదైన టూత్ పేస్ట్‌ను యూజ్ చేస్తూ పోష‌కాహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే స‌రి పోదు.

కొన్ని కొన్ని ఫుడ్స్‌ను డైట్ నుంచి క‌ట్ చేయాలి కూడా.లేకుంటే దంతాల ఆరోగ్యం దెబ్బ తిని బ‌ల‌హీనంగా మారిపోతాయి.

ఇక ఆ త‌ర్వాత ఎన్ని స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం దంతాలు హెల్తీగా ఉండాలంటే ఏయే ఫుడ్స్‌ను డైట్‌లో నుంచి నివారించాలో చూసేయండి.

కిస్ మిస్‌, ఆప్రికాట్స్‌, ఎండు ఖ‌ర్జూరం, ఎండిన అంజీర్ పండ్లు.మొద‌ల‌గు డ్రైడ్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌నూ త‌గ్గిస్తాయి.

కానీ, ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం ప‌లు దంత సంబంధిత స‌మ‌స్య‌లకు దారి తీస్తాయి.

అలాగే ఇటీవ‌ల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది వైన్‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటున్నారు.

లిమిట్‌గా తీసుకుంటే వైన్ ఆరోగ్యానికి మంచిదే.కానీ, ఓవ‌ర్‌గా సేవిస్తే మాత్రం దంతాల‌పై ఉన్న ఎనామిల్ పోయి బ‌ల‌హీనంగా మారిపోతాయి.

వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఇష్టంగా తీసుకునే స్నాక్స్‌లో బంగాళాదుంప చిప్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

కానీ, త‌ర‌చూ బంగాళాదుంప చిప్స్ తింటే దంతాలు క్ర‌మంగా పుచ్చిపోతాయి. """/" / షుగ‌ర్‌తో త‌యారు చేసిన స్వీట్లు, చాక్లెట్లు, క్యాండీలు, చక్కెర పానీయాలలో శీతల పానీయాలు, కార్బోనేటేడ్ పానీయాలు, టీలు, కాఫీలు వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల దంత క్షయం, దంతాలు సెన్సిటివ్‌గా మారి పోవ‌డం, ఎనామిల్ పొర‌ దెబ్బ తిడ‌నం వంటి స‌మ‌స్య‌లెన్నో తీవ్రంగా ఇబ్బంది ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, పైన చెప్పుకున్న ఆహారాల‌కు ఎంత దూరంగా ఉండే మీ దంతాలు ముప్పు అంత త‌గ్గుతుంది.

నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు..: మంత్రి కోమటిరెడ్డి