ఈ ఐదు రకాల ఆహారాలు డైట్ లో ఉంటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు!
TeluguStop.com
చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో( Knee Pain ) బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది.
కాల్షియం కొరత ఇందుకు ప్రధాన కారణంగా మారుతుంది.మోకాళ్ళ నొప్పుల కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు.
ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడం కోసం చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.
కానీ రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి.
కాబట్టి సహజంగా మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల ఆహారాలు ఉత్తమంగా సహాయపడతాయి.
ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది బాదం.( Almond ) బాదం పప్పు కాల్షియం, మెగ్నీషియం మరియు ప్రోటీన్లతో నిండి ఉంటుంది.
ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి కీలకమైన పోషకాలు.అందువల్ల నిత్యం ఐదు నుంచి ఎనిమిది నానబెట్టిన బాదం పప్పులను తీసుకుంటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు.
"""/" /
మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కచ్చితంగా తమ ఆహారంలో ఆకుకూరలను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా పాలకూర, బ్రోకలీ కాల్షియం, విటమిన్ కె, మెగ్నీషియం యొక్క అద్భుతమైన మూలాలు.
పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలను తీసుకుంటే ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతాయి.కీళ్ల వాపుకు కారణమయ్యే ఎంజైమ్‌ను నిరోధిస్తాయి.
"""/" /
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు వారానికి ఒకసారి చేపలు( Fish ) తీసుకోవాలి.
చేపలు విటమిన్ డి మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలలో అధికంగా ఉండే ఆహారం.
విటమిన్ డి కాల్షియం శోషణకు తోడ్పడుతుంది మరియు ఎముక సాంద్రతను నిర్వహించడంలో కీలక పాత్రను పోషిస్తుంది.
పాలు, పెరుగు మరియు చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో( Dairy Products ) కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.
విటమిన్ బి 12 ను కూడా ఇవి కలిగి ఉంటాయి.మీ డైట్ లో ఈ డైరీ ప్రొడెక్ట్స్ ను చేర్చడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.
ఇక మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నవారు సిట్రస్ పండ్లను కూడా తీసుకోవాలి.ఎందుకంటే, సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే విటమిన్ సి బోలు ఎముకల వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది.
ప్రేమలు తర్వాత సరైన సినిమాలనే సెలెక్ట్ చేసుకున్న నస్లెన్, మమితా.. తిరుగుండదు..?