జంతువులకు, పక్షులకు ఇవి సమర్పిస్తే.. సమస్యలు పరిష్కారం..?
TeluguStop.com
మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం గోమాతను పూజించి ఆహారం సమర్పించడం వల్ల సకల దేవతలను నమస్కరించినట్లని భావిస్తాము.
ఈ క్రమంలోనే ఎంతోమంది ఎన్నో రకాల మూగజీవాలను పెంచుతూ వాటికి ఆహారాన్ని సమర్పిస్తుంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పక్షులకు జంతువులకు ఆహారం సమర్పించడం వల్ల ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా పక్షులకు జంతువులకు ఆహారం ఇవ్వడం ద్వారా ఒక్కో గ్రహం నుంచి ఒక్కో విధమైన ఫలితాలను పొందవచ్చు.
అయితే ఏ జంతువులకు ఏ ఆహారం ఇవ్వడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
మూగజీవాలకు ఆహారం ఇవ్వడం ద్వారా శుక్రుడి నుంచి మనకు విముక్తి కలుగుతుంది.అదే విధంగా కోళ్లకు దాన్యం వేయటం వల్ల మన జీవితంలో వచ్చే కష్టాలు తొలగిపోయి, సంతోషాలు ఏర్పడతాయి.
అదేవిధంగా రవి గ్రహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వారు విముక్తి కోసం గోధుమలను పక్షులకు ఆహారంగా సమర్పించాలి.
కొందరికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ మానసికంగా ఎంతో ఆందోళన చెందుతుంటారు.ఈ విధమైన మానసిక ఆందోళనలు తొలగిపోవాలంటే బియ్యం పక్షులకు ఆహారంగా సమర్పించాలి.
"""/" /
బుధ గ్రహం నుంచి ఏర్పడే బాధలు తొలగిపోవాలంటే పెసరపప్పును ఆహారంగా ఇవ్వాలి.
రాహు కేతు గ్రహం నుంచి కలిగే దోషం తొలగిపోవాలంటే కాకులకు, కుక్కలకి ఆహారాన్ని సమర్పించాలి.
ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, మనసు ప్రశాంతంగా ఉండాలంటే పంచదార, పిండితో తయారుచేసిన లడ్డూలను పక్షులకు నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
అయితే ఈ విధంగా పక్షులకు జంతువులకు ఆహారం ఇవ్వటం అనేది శాస్త్రపరంగా దోషాలు తొలగిపోతాయని భావించడంతో పాటు, ఈ విధంగా ఎన్నో రకాల జంతువులకు, పక్షులకు ఆహారం కూడా లభిస్తుంది.
ఈ విధంగా మూగజీవాలకు ఆహారం సమర్పించటం ఎంతో పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది.
చివరిసారిగా మాట్లాంది నేనే .. కొడుకు మరణంపై సుచీర్ బాలాజీ తండ్రి ఆవేదన