ఇవి డైట్ లో ఉంటే కీళ్ల నొప్పుల‌తో నో టెన్ష‌న్‌!

ఒక‌ప్పుడు అర‌వై, డ‌బ్బై ఏళ్లు వ‌చ్చాక మొదలయ్యే కీళ్ల నొప్పులు.ప్ర‌స్తుత రోజుల్లో ముప్పై, న‌ల‌బై ఏళ్ల‌కే ఇబ్బంది పెడుతున్నాయి.

పోష‌కాల కొర‌త‌, ఆహారపు అల‌వాట్లు, కీళ్ల వాపు, ఎముక‌ల బ‌ల‌హీన‌త‌, జీవ‌న శైలిలో మార్పులు, ఏవైనా దెబ్బ‌లు త‌గ‌ల‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కీళ్ల నొప్పులు తీవ్ర‌మైన క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంటాయి.

దాంతో వాటిని త‌గ్గించుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే కీళ్ల నొప్పులతో టెన్ష‌న్ ప‌డ‌క్క‌ర్లేదు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం కీళ్ల నొప్పుల‌ను నివారించే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

అల్లం.కీళ్ల నొప్పుల‌ను నివారించ‌డంలో ఓ న్యాచుర‌ల్ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

అల్లంను ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్‌.ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

కీళ్ల నొప్పుల‌నూ త‌గ్గిస్తుంది.రోజు ఉద‌యాన్నే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను క‌లిపి సేవించాలి.

ఇలా చేస్తే కీళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు వెయిట్ లాస్ అవుతారు.శ‌రీరంలో వ్యర్థాలు సైతం తొల‌గిపోతాయి.

"""/" / వాము.కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న వారు దీన్ని కూడా డైట్‌లో చేర్చుకుంటే ఎంతో మంచిది.

ముఖ్యంగా వాముతో త‌యారు చేసిన టీని తీసుకుంటే కీళ్ల నొప్పులు క్ర‌మంగా దూరం అవుతాయి.

"""/" / రాగులు, జొన్నలు, సజ్జలు వంటి సిరి ధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఇవి ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచి కీళ్ల నొప్పుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నివారిస్తాయి.ఇక ఇవే కాకుండా ప‌సుపు, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్‌, చేప‌లు వంటివి సైతం డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

Director Santhossh Jagarlapudi : భగవద్గీత గొప్పతనాన్ని చెప్పే సినిమా చేస్తున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి…