ఈ దేవాలయంలో దొంగతనం చేస్తే.. పూజారులే సహకరిస్తారా..?
TeluguStop.com
సాధారణంగా చెప్పాలంటే భక్తులు దేవాలయానికి వెళ్తే దేవునికి కానుకలు సమర్పించి కోరికలు నెరవేర్చమని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.
అలాగే మరి కొంతమంది భక్తులు భగవంతునికి తలనీలాలు సమర్పించి తమ మొక్కలను చెల్లించుకుంటూ ఉంటారు.
కానీ ఈ దేవాలయానికి వెళ్తే భక్తులు మాత్రం గుర్తు చప్పుడు కాకుండా దేవాలయంలోనే దొంగతనం చేయాలని చూస్తారు.
అందుకు దేవాలయంలో ఉండే పూజారులే సహకరిస్తూ ఉంటారు.మరి ఆ దేవాలయం కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ఉత్తరాఖండ్( Uttarakhand ) లోని చూడామణి దేవి దేవాలయం ఉంది.
ఈ దేవాలయంలో సంతానం లేని వారు దొంగతనం చేస్తే పిల్లలు పుడతారని చాలామంది ప్రజలు నమ్ముతారు.
దొంగతనం అంటే డబ్బు, బంగారం కాదు.అమ్మవారి దగ్గర ఉండే చెక్కబొమ్మలను దొంగలు ఇస్తారు.
దానిని ఇంటికి తీసుకెళ్ళి బిడ్డ పుట్టిన తర్వాత దొంగలించిన బొమ్మతో పాటు మరో బొమ్మని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు.
ఈ దొంగతనానికి అక్కడి పూజారులు కూడా సహకరిస్తారని స్థానిక భక్తులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే 1805లో ఒక రాజు అడవిలో సంచరిస్తుండగా చూడామణి దేవాలయాన్ని చూసి తమకు పిల్లలను ప్రసాదించాలని ప్రార్థించాడు.
"""/" /
అప్పుడు అమ్మవారు చెక్క బొమ్మ రూపంలో దర్శనం ఇచ్చారు.అందుకోసం ఎవరికీ తెలియకుండా చెక్క బొమ్మను ఇంటికి తీసుకువెళ్లిన రాజుకు పండంటి బిడ్డ పుట్టాడు.
దీంతో రాజు చెక్క బొమ్మతో పాటు మరోచక్క బొమ్మను అమ్మవారికి సమర్పించాడు.అలా ఈ దేవాలయంలో బొమ్మను దొంగలించే సంప్రదాయం మొదలైందని స్థానిక పండితులు చెబుతున్నారు.
ఈ దేవాలయానికి సంతానం లేని జంటలు వచ్చి దొంగతనం చేస్తూ ఉంటారు.ఈ దొంగతనానికి స్థానిక పూజారులు కూడా సహాయం చేస్తూ ఉంటారు.
ఓరి దేవుడా.. కళ్ళు సీసాలో ప్రత్యక్షమైన కట్లపాము