ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే.. పూజగది కచ్చితంగా ఇలా ఉండాలి..!
TeluguStop.com

మన దేశంలో దాదాపు చాలామంది ప్రజల ఇంటి ఆవరణలో తులసి మొక్క( Basil Plant ) పెంచుకుంటూ ఉంటారు.


ప్రతి ఇంటికి సరైన దిశలో దేవుని గది కూడా ఉంటుంది.దేవుడి గదిలో ప్రశాంతంగా ఉన్న దేవతల విగ్రహాలు లేదా ఫోటోలను ఉంచుతారు.


దేవుని గదిలో మనం ఉంచే ప్రతి ఫోటో లేదా విగ్రహం ఆకారం రంగు ఎత్తును సరైనదిగా ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.
శరీరక దైవ ప్రపంచక సమస్యల నుంచి బయటపడి సుఖశాంతులతో జీవించాలంటే ఇంట్లో దేవుడి గదిలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి.
ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పూజ గదిని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్యములలో ఉండేలా చూసుకోవాలి.
"""/" /
అలాగే పూజ గదిలో దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు పెట్టే ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి.
ముఖ్యంగా చెప్పాలంటే పూజ గది ఎప్పుడు సరళంగా ఉండాలి.దానికి గోపురం లేదా త్రిశూలం ( Trident )అసలు ఉండకూడదు.
పూజ గదిలో పాలరాతి మందిరాలు పెట్టడం మంచిది కాదు.చెక్కతో చేసిన మందిరాలే ఉత్తమమని పండితులు చెబుతున్నారు.
అలాగే పూజ గదిలో ఎక్కువ సంఖ్యలో దేవుని విగ్రహాలను ఉంచకూడదు.అంతే కాకుండా పూజ గదిలో దేవుడి క్యాలండర్ కూడా ఉంచకూడదు.
"""/" /
దేవుడి విగ్రహం( A Statue Of God ) ఎత్తుగా ఉండకూడదు.
బొటన వేలు ఎత్తుకు సమానంగా ఉంటే అది చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో శివలింగాన్ని అసలు ఉంచకూడదు.ఒకవేళ ఉంటే నిత్యం అభిషేకం చేయడం మర్చిపోకూడదు.
బాలకృష్ణుడు విగ్రహం( Balakrishna Idol ) పూజ గదిలో ఉండాలి.దానికి తప్పనిసరిగా రోజువారి భోగాలు అందించాలి.
పూజ గదిలో నటరాజ విగ్రహం ఉండకూడదు.శ్రీరామ పట్టాభిషేకం శివ కుటుంబం కలిసి ఉన్న విగ్రహం లేదా ఫోటో తప్పనిసరిగా పూజ గదిలో ఉండాలి.
అలాగే శాంత స్వరూపంలో ఉన్న దుర్గాదేవి విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ఉంచాలి.మీ పూర్వీకులు లేదా తల్లిదండ్రుల ఫోటోలు పూజ గదిలో ఉండకూడదు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి12, బుధవారం 2025