ఇక స్పందించాల్సింది జగనే .. లేకపోతే ? 

వైఎస్ కుటుంబంలో తలెత్తిన ఆస్తుల వివాదం రాజకీయంగాను రచ్చగా మారింది.వైసీపీ అధినేత జగన్ ( YCP Chief Jagan ), ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల( Sharmila ) మధ్య ఆస్తుల పంపకాల వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ నెలకొంటోంది.

షర్మిల , జగన్ మధ్య తలెత్తిన వివాదం ని తమకు అనుకూలంగా మార్చుకుని జగన్ ను ఇరుక్కుని పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి టిడిపి,  జనసేన పార్టీలు.

ఇక ఈ ఆస్తుల పంపకాల వ్యవహారంపై వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి జగన్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కూడా స్పందించారు ఈ వ్యవహారంలో షర్మిలకు మద్దతు గానే విజయమ్మ మాట్లాడారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి , వైవి సుబ్బారెడ్డిలు( Vijayasai Reddy , YV Subbareddy ) చేస్తున్న కామెంట్స్ ను ప్రస్తావించి విజయమ్మ తప్పు పట్టారు.

"""/" / ఇక ఈ ఆస్తుల వ్యవహారంలో అటు షర్మిల ,విజయమ్మ,( Sharmila, Vijayamma ),  ఇటు వైసిపి నేతలు ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు.

షర్మిల విజయమ్మ చెప్పిన విషయాలకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి వారు చెప్పాల్సింది చెప్పేస్తారు .

ఇక ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ఈ వ్యవహారంపై నేరుగా స్పందించలేదు.

తన మాటలను వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డిల ద్వారా చెప్పిస్తున్నారు.  రాజకీయంగాను,  ఈ వ్యవహారం వైసిపికి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో , జగన్ మీడియా ముందుకు వచ్చి ఈ వ్యవహారంపై ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది కానీ,  ఇప్పటివరకు జగన్ ఆ పని చేయలేదు.

ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో విజయం ఎవరు వైపు ఉంటారు అంటూ ఆసక్తిగా ఎదురు చుశారు .

"""/" / ఈ వ్యవహారంలో షర్మిలవైపే విజయమ్మ ఉన్నారనే విషయం క్లారిటీ వచ్చేసింది.

ఈ వ్యవహారంలో ఇక స్పందించాల్సింది జగనే .అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది ఎలా పరిష్కరించుకుంటారు అనే విషయాన్ని జగన్ నేరుగా చెప్పాల్సి ఉంటుంది.

వైఎస్ కుటుంబ ఆస్తుల పంపిణీ జరగలేదని వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పేశారు.తన ఆస్తిని కూడా తనకు చెల్లికి ప్రేమతో జగన్ ఇచ్చారని,  ఎంఓయు చేసుకున్నట్లు వైసిపి నేతలు చెబుతున్నారు.

  కానీ ఇందులో వాస్తవం ఎంత అనేది చెప్పాల్సి ఉంటుంది.  అలాగే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సంబంధించినది కూడా ఏం జరిగిందనే విషయాలను విజయమ్మ , షర్మిల పూర్తిగా చెప్పలేదు .

దీనిపైన జగన్ స్పందించాల్సి ఉంటుంది .అసలు పంపిణీ కానీ ఆస్తులు విషయంలో జగన్ డివిడెంట్ ఎలా ఇస్తారు అనేది ప్రశ్నగా మారింది .

దీనిపైన జగన్ స్పందించాల్సి ఉంటుంది.ఇంత  రాద్ధాంతం జరుగుతున్నా, జగన్ నోరు ఎత్తకపోతే అది వ్యక్తిగతంగాను,  రాజకీయంగాను జగన్ కు తీరని నష్టాన్ని చేకూర్చే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భారతీయ పాటకు దీపావళి వేళ అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టిన అమెరికన్ అంబాసిడర్