చూపుడు వేలుకు చుక్క ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్య వేలుకు:కలెక్టర్
TeluguStop.com
రాష్ట్రంలో ఈ నెల 13 న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటరుకి ఎడమ చేతి చూపుడు వేలుపై ఇన్ డిలేబుల్ ఇంక్ పెట్టడం జరిగిందని,మరల ఈ నెల 27 న జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నందున ఆ ఎన్నికలలో పాల్గొనే పట్టభద్రులు పార్లమెంటు ఎన్నికలలో ఓటు వేసి ఉన్నట్లయితే అట్టివారికి చూపుడువేలు బదులుగా మధ్య వేలుకి ఇండెలిబుల్ ఇంకు గుర్తు పెట్టాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.
వెంకట్రావు (Suryapet ,District Collector S.Venkatarao )శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి 49కే ప్రకారం వేలు నియమం మిస్ అయినట్లయితే 1961 వర్తింప జేయడం జరుగుతుందని,జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్,
ప్రొసీడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్పుడు ఓటరుయొక్క ఎడమ చేతి చూపుడు వేలుని పరిశీలించి ఇంకును పెట్టాలని సూచించారు.