శరీరం పై ఈ భాగంలో పుట్టుమచ్చలు ఉంటే సంపన్నులు అయ్యే అవకాశం ఉందా..

ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అదృష్ట రేఖ అనేది ఉంటుంది.

ఎందుకంటే చాలామంది ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అదృష్టం అనేది లేదా అని అనుకుంటూ ఉంటారు.

అలాంటి అదృష్టాన్ని పుట్టుమచ్చలను చూసి వీరికి అదృష్టం ఉందో లేదో చెప్పేస్తున్నారు.మానవ శరీరంలోని వివిధ భాగాల్లో పుట్టుమచ్చల వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయో జ్యోతిష్య శాస్త్రం వివరంగా చెబుతోంది.

అయితే మగవారికి, ఆడవారికి పుట్టుమచ్చల విషయంలో చాలా తేడాలు ఉంటాయి.అయితే పుట్టుమచ్చలు ఉన్న చోటును బట్టి అవి అదృష్టాన్ని కలిగిస్తాయో, దురదృష్టాన్ని కలిగిస్తాయో తెలుసుకోవచ్చు.

మగవారికి తమ కుడి వైపు శరీర భాగంపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే అదృష్టమని పండితులు చెబుతూ ఉంటారు.

అదే మహిళలకు అయితే ఎడమవైపు శరీరంపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టమని కూడా చెబుతారు.

ఏ వ్యక్తి శరీరం పైన 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది చెడు సంకేతకమని చెబుతారు.

వారి జీవితంలో ఆనందం మనశ్శాంతి ఉండమని కూడా చెబుతున్నారు.కుడి కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

"""/"/ కుడి చేతి పై పుట్టుమచ్చ ఉన్న వారికి డబ్బుకు కొరతా ఉండదని వేద పండితులు చెబుతున్నారు.

వారి జీవితంలో అన్నీ పొందడమే కాకుండా, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి అని చెబుతున్నారు.

కుడి చెంప పై పుట్టుమచ్చ ఉంటే చాలా శుభం అని మచ్చ శాస్త్రం చెబుతోంది.

చాతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.వీరు ఎప్పుడూ అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉంటారు.

వీరి జీవితంలో ఏ పని చేయాలనుకున్నా సులభంగా చేస్తూ ఉంటారు.ముఖంపై ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే ఇలాంటివారు డబ్బును ఎక్కువగా వృధా చేస్తారట.

ముఖంపై కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే సంపద, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట.కుడివైపు కంటిలో పుట్టుమచ్చ ఉంటే వాళ్లు క్రియేటివ్ గా ఆలోచిస్తారని మచ్చ శాస్త్రం చెబుతోంది.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!