వైరల్ వీడియో: అసలు ఆడదానివేనా నువ్వు.. మొగుడ్ని అంతలా చిత్రహింసలు పెడతారా..

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక ఎలాంటి వార్తలైనా సరే నిమిషాల్లో ఇట్లే తెలిసిపోతున్నాయి.

ఈ మధ్యకాలంలో భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనం చూస్తూనే ఉన్నాము.

కట్నం తీసుకురాలేదని, లేకపోతే భార్య( Wife ) అందంగా లేదని భర్తలు వేధిస్తూ ఉన్న కామన్ విశేషాలకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాము.

కాకపోతే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.కొత్తగా భర్తలను భార్యలు వేధించడం మొదలుపెట్టారు.

అనేక విషయాల్లో భార్యల టార్చర్ భర్తలను ఇబ్బంది పెడుతోంది.తాజాగా ఇలాంటి ఓ వార్తకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలకు వెళితే. """/" / ఉత్తర ప్రదేశ్ లోని బిచ్నూర్ జిల్లాలో( Bichnoor ) చోటుచేసుకుంది.

మన్నెన్, మెహర్( Mannen, Mehr ) లు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వారి సంసార జీవితంలో వారిద్దరూ మందు, సిగరెట్లకు అలవాటు పడిపోయారు.

పెద్దలకు దూరంగా వీరిద్దరూ సపరేట్ గా కాపురం ఉన్నారు.వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న పెళ్లి తర్వాత ఇద్దరు సంతోషంగా లేరు.

పెళ్లి తర్వాత భార్య వేరు కాపురం ఉందామంటూ భర్తకు టార్చర్ చూపిస్తూ వచ్చింది.

దాంతో సదరు భర్త ఆమె టార్చర్ ను భరిస్తూ ఎలాగోలాగా తప్పించుకుంటూ వచ్చాడు.

దీంతో భార్య మెహర్ భర్తను వేధించడం మొదలు పెట్టింది. """/" / ఇందులో భాగంగానే రాత్రి పూట సిగరెట్లు తాగి భర్తను వేధించడం మొదలుపెట్టింది.

తనని ఏమన్నా అంటే రివర్స్ లో కేసు పెడతానంటూ అతని బెదిరించసాగింది.వీటితోపాటు భర్తకు మత్తు పదార్థాలు కలిపిన పానీయాలు ఇస్తూ బలవంతంగా తాగించేది.

వాటిని తాగిన తర్వాత అతడు నిద్రలోకి వెళ్ళాక అతడి కాళ్ళను చేతులను మంచానికి కట్టేసి సిగరెట్ తాగి అతని ప్రైవేట్ పార్ట్ లకు చురకలు అందించేది.

దాంతో అతడు సిగరెట్ తో కాల్చిన వాతల వల్ల నరకం అనుభవించాడు.అనేక మార్లు ఈ విషయం సంబంధించి కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు ఎవరు అతని మాట వినలేదు.

దాంతో అతడు తన బెడ్రూంలోకి సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి అసలు విషయాన్ని చిత్రీకరించాడు.

ప్రతిరోజు లాగే ఆరోజు కూడా ఆమె రెచ్చిపోయి కాళ్లు చేతులు కట్టేసి భర్తకి టార్చర్ చూపించిన విధానం మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కాగా దాన్ని తీసుకుపోయి పోలీసులకు అందించడంతో.

వెంటనే వీడియోని ఆధారంగా చేసుకుని సదరు మహిళపై కేసు నమోదు చేసి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా భార్య వివాహేతర సంబంధానికి అతడు అడ్డు వస్తున్నాడని అతని తప్పించుకోవడానికి ఆమె ఎలా చేసిందంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది.