వ్యాక్సిన్ వికటిస్తే పూర్తి బాధ్యత వారిదే అంటున్న కేంద్రం.. !! 

Span Style="font-weight: 400"ప్రపంచంలో ఇప్పటికే అనేక దేశాలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే తరుణంలో ఇండియాలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగింది.రేపటి నుండి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు కేంద్రం యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించనున్నయి.

ప్రధాని మోడీ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం రేపటి నుండి ప్రారంభం కానుంది.

/span """/" /   Span Style="font-weight: 400"తొలి రోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలి అన్న దానిపై ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది.

ఇలాంటి తరుణంలో ఒకవేళ వ్యాక్సిన్ వికటిస్తే అనే దాని విషయం గురించి కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

మేటర్ లోకి వెళితే చాలా దేశాలలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే.

కొన్నిచోట్ల అయితే మరణించిన దాఖలాలు ఉన్నాయి.ఇలాంటి తరుణంలో ఇండియాలో వ్యాక్సిన్ ఒకవేళ గనుక వికటిస్తే దాన్ని పూర్తి బాధ్యత ఆ వ్యాక్సిన్ యొక్క కంపెనీదే అని కేంద్రం తేల్చిచెప్పింది.

మరోపక్క వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో దేశ ప్రజలలో సంతోషం నెలకొంది.ప్రపంచంలో కెల్లా అన్ని దేశాలలో ఇండియాలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కావటంతో.

ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు ఇండియాలో అందుబాటులోకి రానున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ పనితనం ఎలా ఉంటుందా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

  /span.

స్విమ్ సూట్ లో సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రత.. ఈ ఫోటోలను చూస్తే షాకవ్వాల్సిందే!