బాడీమీద ఎండ ప‌డ‌క‌పోయినా క్యాన్స‌ర్ వ‌స్తుందంట‌.. ఎలాగంటే..?

నేటి ఆధునిక సమాజంలో ఎక్కువ మందిని కబళించే వ్యాధుల్లో ఒకటి క్యాన్సర్.ఈ వ్యాధి భారిన పడి పట్టణ ప్రాంతాల ప్రజలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని వారు కూడా బాధపడుతుంటారు.

చిన్నపటి నుంచి దురలవాట్లకు అలవాటు పడ్డ వారికే క్యాన్సర్ వస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు.

కానీ ఎలాంటి చెడ్డ అలవాట్లు లేని అమాయకులకు కూడా క్యాన్సర్ రావడం మనం గమనించవచ్చు.

చెడు అలవాట్లు ఉంటేనే క్యాన్సర్ వస్తుందనేది ప్రజల భ్రమ మాత్రమే అని చాలా మంది చెప్పారు.

కానీ ఇప్పటికీ కొంతమంది ప్రజలు క్యాన్సర్ వచ్చిందంటే చాలు అతడికి చెడు అలవాట్లు ఉన్నాయా అని అడుగుతారు.

ఇన్నాళ్లు క్యాన్సర్ వచ్చిందంటే ఎలా వచ్చిందా అని ప్రజలు ఆరాలు తీసేవారు.కానీ తాజాగా శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు వింటే షాక్ తింటారు.

మనిషి శరీరంపై ఎండ వేడిమి పడకపోవడం కూడా క్యాన్సర్ రావడానికి ఓ కారణమాని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఇన్నాళ్లు ఎండ సరిగ్గా పడకపోతే కేవలం డీ విటమిన్ లోపం మాత్రమే వస్తుందని తద్వారా డీ విటమిన్ ను తీసుకుంటే ఇది తగ్గిపోతుందని భావించేవారు.

"""/" / కానీ తాజాగా శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.సూర్యరశ్మి పడని చాలా మందిలో పెద్దపేగు ద్వారా మలద్వార క్యాన్సర్‌ వస్తోందని కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు గుండె పగిలే నిజం చెప్పారు.

ఇలా సూర్యరశ్మి ప్రభావం వల్ల 2017, 2018 సంవత్సరాల్లో 186 దేశాల్లో అధ్యయనం చేశారు.

ఇందులో 45 సంవత్సరాలకు పై బడి ఉన్న వారిలో ఇలా సూర్య రశ్మి పడకపోవడం వల్ల కలిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

దీన్ని బట్టి డీ విటమిన్ విరివిగా లభించేలా ఉదయం పూట సూర్య రశ్మికి నిలుచుంటే క్యాన్సర్ ముప్పు నుంచి సుళభంగా తప్పించుకోవచ్చు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?