BJP Kishan Reddy : ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలింది..: కిషన్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Redd ) స్పందించారు.

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉండటంతోనే ఆమెను ఈడీ అరెస్ట్ చేసిందన్నారు.

ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలిందని పేర్కొన్నారు.ఈ కేసులో ఈడీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

అదేవిధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Aravind Kejriwal ) ను అరెస్ట్ చేస్తే బ్లాక్ డే ఎందుకో చెప్పాలన్నారు.

కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే అవినీతిని విడిచిపెట్టాలా అని ప్రశ్నించారు.ఆప్ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్( BRS ) పది సంవత్సరాల పాలనలో మద్యాన్ని ఏరులై పారించారన్న కిషన్ రెడ్డి వేల్ఫేర్ యాక్టివిటీ పేరు మీద ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

మద్యం షాపుల నిర్వహణలో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా లేదని విమర్శించారు.