రోడ్డుపై కట్టలు కట్టలుగా క్యాష్ విసిరిన కొరియన్ యువతి.. కట్ చేస్తే..??

చాలా మంది తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి డబ్బులు సంపాదించాలనుకుంటారు.డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు.

కొంతమంది మాత్రం అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు.రోడ్డుపై మనీ దొరికితే ఎవరు చూడకుండా వాటిని జేబులో పెట్టుకొని వెళ్లిపోయేవారు చాలామంది ఉంటారు కానీ కొంతమంది డబ్బు కోసం ఆశపడరు.

అలాంటి నిజాయితీపరులను కనిపెట్టి వారి నిజాయితీకి రివార్డు ఇవ్వాలని ఒక కొరియన్ యువతి( Korean Girl ) భావించింది ఆమెకు సంబంధించిన ఒక వీడియో రీసెంట్ గా వైరల్ అయింది.

అందులో ఒక అమ్మాయి కారు వెనుక సీటులో కూర్చోని, ఒక సంచిలో చాలా డబ్బు ఉంచుకుంటుంది.

ఆమె రహస్యంగా ఒక డబ్బు కట్టను తీసుకొని, రోడ్డుపై వెళ్ళే వ్యక్తుల నిజాయితీని పరీక్షించడం ప్రారంభిస్తుంది.

చాలా మంది ఆమె డబ్బు కట్టను తీసుకుని వెళ్లిపోతారు.ఈ ప్రయోగం తర్వాత ఆమె చాలా బాధపడుతుంది.

కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన ఆమెను నవ్వేలా చేస్తుంది. """/" / దక్షిణ కొరియాకు( South Korea ) చెందిన లిల్లీ ( @kkubi99 ) అనే యువతి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఆమె తరచుగా విభిన్న శైలులలో వీడియోలను పోస్ట్ చేస్తుంది.ఈ వీడియోలో, లిల్లీ కారు వెనుక సీటులో కూర్చుని ఉంటుంది.

పార్కింగ్ లాట్ వైపు వెళుతూ, ఆమె ఒక డబ్బు కట్టను రోడ్డుపై వేస్తుంది.

అటువైపు నుంచి ఒక జంట వస్తుంది.వారు ఆ క్యాష్ చూడగానే సంతోషిస్తారు.

దానిని తీసుకొని వెళ్లిపోతారు.అయితే, వారిని చూస్తే వారికి ఆ డబ్బు అవసరం లేనట్లు అనిపిస్తుంది.

కానీ వారు ఈ నిజాయితీ పరీక్షలో విఫలమయ్యారు. """/" / బహుశా, లిల్లీ గతంలో కూడా ఇలాంటి మనీ బండిల్స్ వేసి ఉండవచ్చు, వాటిని ప్రజలు తీసుకువెళ్లి ఉండవచ్చు.

కాబట్టి, ఆ జంట డబ్బును తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, ఆమె బాధపడుతుంది.అయినప్పటికీ, ఆమె పార్కింగ్ లాట్ వైపు వెళుతూ మరొక క్యాష్ బండిల్‌ రోడ్డుపై వేస్తుంది.

ఇంతలో, చిరిగిన బట్టలు వేసుకున్న ఒక యాచకురాలు పరిగెత్తుకుంటూ వస్తుంది.ఆమె ఆ డబ్బును చూసి సంతోషిస్తుంది.

కానీ తర్వాత కారు దగ్గర లిల్లీ కూర్చొని ఉండటాన్ని గమనించి, ఆమెకు డబ్బు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.

లిల్లీ ఆ యాచకురాలు నిజాయితీకి ముగ్ధురాలై, తన బ్యాగ్‌లో ఉన్న మిగిలిన డబ్బు కూడా ఆమెకు ఇస్తుంది.

ఇద్దరూ సంతోషంగా ఉంటారు.ఈ వీడియో కేవలం 14 గంటల్లోనే 95 లక్షల మంది చూశారు.

అంతేకాకుండా, 10 వేల నుంచి 50 వేల మందికి పైగా లైక్‌లు వచ్చాయి.

1000 కంటే ఎక్కువ కామెంట్‌లు కూడా వచ్చాయి.అయితే, ఈ వీడియో చూస్తే, అది కేవలం సోషల్ ఎక్స్‌పరిమెంట్ కోసమే చేసినదేనని స్పష్టంగా తెలుస్తుంది.

దీనిని మీరూ చూసేయండి.

నిజ్జర్ హత్య కేసు : కెనడా కోర్టు ఎదుట హాజరైన నలుగురు భారతీయ యువకులు