రైతు ఆరు కాలం కష్టపడితే కన్నీళ్లే మిగిలాయి!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం కారణంగా రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు పడి అనేక ఎకరాల పంట నేలపాలై రైతులు అగమ్య గోచరంలో రోదిస్తూ వారు పెట్టిన పెట్టుబడి కూడా రాదని కన్నీరు పెడుతున్నారు.

కోసిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెట్టుకొని 15 రోజులు అవుతున్నా కూడా అధికారులు వాటిని కొనడం లేదని ఈ వర్షానికి ఉన్న వడ్లు కూడా మొలకలెత్తి కనీస ధర కూడా రాకుండా అవుతుందని మనోవేదనతో మేము చనిపోవాలనుకుంటున్నామని అయినా కూడా ఎవరికి రైతుపై కనికరం రావడంలేదనే చింతతో ఎదురుచూస్తున్న సమయం లో ఈరోజు డాక్టర్ గోలి మోహన్ పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మొలకెత్తిన వడ్లను చూసి చలించిపోయారు.

ఒక రైతు కొడుకుగా ఆ బాధ ఎలా ఉంటుందో అది చూసి ప్రతి రైతుకు మనోధైర్యం ఇచ్చేలా ప్రభుత్వానికి విన్నపించారు.

ఇప్పటికైనా అధికారులు వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాల నుండి వడ్లను కొని రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రి కే తారక రామారావు రైతులను ఆదుకొని వారికి మనోధైర్యం ఇవ్వాలని అధికారులకు సత్వరమే ఆదేశాలిచ్చి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లను కొనే లాగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

సాగర తీరంలో విరాట్ కోహ్లీ సైకత శిల్పం.. హ్యాపీ బర్త్డే కోహ్లీ